పట్టు.. చేసెను కనికట్టు!


Thu,October 11, 2018 11:45 PM

రంగు రంగుల పూలతో.. బతుకమ్మను పేర్చి.. దానిచుట్టూ రంగు రంగుల చీరలతో.. ఆడపడుచులు సందడి చేస్తుంటే.. ఆ అందాన్ని వర్ణించడం ఎవరి తరమూ కాదు!
ఈ పండుగ పూట.. పట్టుదే పై చేయి.. అందుకే ప్రత్యేకమైన కలెక్షన్ మీకోసం..

వంకాయ రంగు పట్టు చీరకి డబ్బాలు డబ్బాలుగా లైన్స్ వచ్చాయి. వాటి మధ్యలో మామిడి పిందెల డిజైన్ మిమ్మల్ని కట్టి పడేస్తుంది. పింక్ కలర్ బార్డర్ మీద కూడా ఇదే డిజైన్ వచ్చింది. వంకాయ రంగు బ్లౌజ్ మీద హెవీ వర్క్ చేయిస్తే మరింత
బాగుంటారు.
fashion
నలుపు రంగు ఎక్కడున్నా కట్టి పడేస్తుంది. దీని మీద సిల్వర్, గోల్డ్ కాంబినేషన్‌లో చెక్స్ వచ్చాయి. గ్రీన్, బ్లూ మిక్సింగ్‌లో గోల్డ్ జరీ బార్డర్ పర్‌ఫెక్ట్‌గా సూటయింది. ఆకుపచ్చని సిల్క్ బ్లౌజ్‌కి నెట్ జత చేసి కుట్టడంతో రాయల్ లుక్‌లో మెరిసిపోవచ్చు.


పసుపు పచ్చని పట్టు చీరకి, పింక్ కలర్ జరీ బార్డర్ మరింత వన్నె తెచ్చింది. చీర మొత్తం మధ్యలో వచ్చిన లైన్స్ చీర అందాన్ని రెట్టింపు చేశాయి. పర్‌ఫెక్ట్ మ్యాచింగ్ బ్లౌజ్ వేస్తే అందరిలో సెంటరాఫ్ ఎట్రాక్షన్ మీరే అవ్వడం ఖాయం.

భిన్నత్వం కోరుకునే వారు.. ైస్టెలిష్‌గా మెరువాలనుకునేవారు ఈ చీర ట్రై చేయండి. గ్రీన్ కలర్ మీద డిఫరెంట్ సిల్వర్, బ్లూకలర్ థీమ్‌తో వచ్చిన డిజైన్ చూపరులను ఆకట్టుకుంటుంది. దీనికి క్రీమ్ కలర్ పట్టు బ్లౌజ్ మీద నెమలి డిజైన్ వచ్చేలా వర్క్ చేయించడంతో చూడముచ్చటగా ఉంది.
fashion1
ఫ్యాన్సీ పట్టు చీరలకు ఈ పండుగ పూట పెద్ద పీట వేయండి. రోటీన్‌కి భిన్నంగా ఉండే ఇలాంటి పట్టు చీరలను ఎంచుకోండి. వైట్ కలర్ మీద పింక్ కలర్ బుటీ వచ్చింది. దీనికి గోల్డెన్ బార్డర్ తోడయింది. బ్లౌజ్‌ని కాస్త డిఫరెంట్‌గా ఇవ్వడంతో సూపర్ లుక్ సొంతమైంది.

793
Tags

More News

VIRAL NEWS

Featured Articles