వివక్షను ఎలుగెత్తి చాటుతూ..!


Thu,October 11, 2018 11:43 PM

Ankith-Misraa
మానవుడు అంతరిక్షంలో నివాసం ఏర్పచుకోవడానికి సన్నాహాలు చేస్తున్న ఈ రోజుల్లో కూడా.. మహిళలను మూఢాచారాలతో ఇంటికి పరిమితం చేస్తున్నారు కొందరు. దేవతలను పూజించేందుకు కూడా రుతుస్రావం పేరుతో అడ్డు చెబుతున్నారు. ఈ వివక్షను రూపుమాపేందుకు ముంబైకి చెందిన ఈ ఆర్టిస్ట్ చిత్రకళను సాధనంగా ఎంచుకున్నాడు.
Ankith-Misra
ముంబైకి చెందిన అనికేత్ మిశ్ర గ్రాఫిక్ డిజైనర్. అతను హిందీ సినిమాలకు గ్రాఫిక్స్ డిజైన్ చేస్తుంటాడు. విజయానికి ప్రతీక అయిన దసరాను రుతుస్రావ మహిళలు ఎందుకు జరుపుకోకూడదు. దుర్గాదేవి కూడా మహిళేగా! అలాంటిది రుతుస్రావ మహిళలకు ఎందుకు పూజాకార్యక్రమాల్లో నిషేధం కొనసాగుతుంది? అంటూ సమాజాన్ని ప్రశ్నిస్తున్నాడు. నాటి నుంచి నేటి వరకూ మహిళలపై కొనసాగుతున్న వివక్షను తన ఆర్ట్‌వర్క్ ద్వారా లోకానికి అర్థమయ్యేలా చెప్పాలనుకున్నాడు. శానీటరీ ప్యాడ్‌పై రక్తపు మరక ఉన్న తామరపువ్వును చిత్రించాడు. దాని చుట్టూ మహిళా దేవతల బొమ్మలను అలంకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్ 24 గంటల్లోనే 4 వేల షేర్స్ సొంతం చేసుకున్నది. దీనిపై కొందరు హిందుత్వవాదులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. నేను శక్తి స్వరూపిణిని. నా దేవతను పూజిస్తాను అనే అర్థంతో ఆర్ట్ డిజైన్ చేశాడు. ఈ పోస్ట్ పెట్టిన తర్వాత అనికేత్ ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చింది. అతను చేసింది మంచి పనే అయినా, కొంతమంది అతనిపై చెడుగా సోషల్ మీడియాలో ప్రచారం మొదలుపెట్టారు. అయితే, ఎంతోమంది అనికేత్‌కు సపోర్ట్‌గా ట్విట్టర్‌లో పోస్టులు చేస్తున్నారు. పండుగల సమయాల్లో మహిళలకు రుతుస్రావమైతే ఎంత ఇబ్బంది ఉంటుందో.. తాను ప్రత్యక్షంగా చూశానని, అందుకే ఈ వివక్షను రూపుమాపాలనే ఈ ఆర్ట్ డిజైన్‌ను పోస్ట్ చేసినట్లు చెబుతున్నాడు అనికేత్ మిశ్రా.

1342
Tags

More News

VIRAL NEWS