పుస్తకాలతో కొత్త ప్రపంచం!


Thu,October 11, 2018 11:42 PM

నిరుపేద చిన్నారులకు పుస్తకాలను చదువడం అలవాటు చేయడమేకాకుండా, సొంతంగా ఆలోచించగలిగే విధంగా సామాజిక చైతన్యం కలిగిస్తున్నది ఓ ఎన్జీవో. గ్రంథాలయాలను ఏర్పాటు చేసి విప్లవాత్మక మార్పును తీసుకువస్తున్నది. అంతేకాకుండా కథల రూపంలో మంచి, చెడుల గురించి విద్యార్థులకు చెబుతూ సరికొత్త ప్రపంచాన్ని వారికి పరిచయం చేస్తున్నది.
Share-A--book
ముంబైకి చెందిన షేర్ ఏ బుక్ ఇండియా అనే ఓ స్వచ్ఛంద సంస్థ నిరుపేద చిన్నారులకు పుస్తకాలను చదువడం అలవాటు చేయిస్తున్నది. విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకువస్తే.. లింగ భేదాలు, ఆర్థిక అసమానతలు తొలుగుతాయని విశ్వసిస్తున్నది. అంతేకాకుండా పిల్లలు ఎలా బతుకాలో పుస్తకాలు నేర్పిస్తాయని సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. పుస్తకాలను చదువడం వల్ల సమాజంలోని స్థితి గతులు తెలుస్తాయని అంటున్నారు. అలాగే ప్రతి ఒక్కరూ పుస్తకాలను చదువడం అనేది అలవాటుగా చేసుకుంటే తమ జీవితం రంగులమయం అవుతుందని అంటున్నారు. చిన్నవయసులోనే పుస్తక పఠనం అలవాటు చేస్తే వారి భవిష్యత్‌ను వారే తీర్చిదిద్దుకుంటారని అంటున్నారు. ఇందుకు నీతి కథలు, వ్యక్తిత్వ వికాస పుస్తకాలను అందిస్తున్నారు. షేర్ ఏ బుక్ సంస్థకు చెందిన వలంటీర్లు నిరుపేద పిల్లలను ఒకచోటికి చేర్చి అవగాహన కల్పించి పుస్తకాలుఅందిస్తున్నారు. కో-ఫౌండర్ ప్రీతి స్కూల్ విద్యార్థులకు సిండ్రిల్లా కథను చెప్పిస్తున్నారు. మొదట్లో అంతగా ఆసక్తి చూపని విద్యార్థులు.. కొద్దిరోజుల తర్వాత ఎంతో శ్రద్ధగా వింటూ క్రమశిక్షణగా నేర్చుకుంటున్నారు. ప్రతీ శనివారం ఒక్కో కొత్త కథతో వలంటీర్లు ఆయా పాఠశాలలకు వెళ్లి బోధిస్తున్నారు. పుణేలోని టీచ్ ఫర్ ఇండియా సహకారంతో మూడు ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకొని విద్యాబుద్ధులు నేర్పిస్తున్నారు.

554
Tags

More News

VIRAL NEWS