బంగారం.. వెండి మెరిసిపోయేలా!


Thu,October 11, 2018 11:39 PM

gold-care
-నీటిలో డిటర్జెంట్ లేదా లిక్విడ్ వేసి బంగారు ఆభరణాలను కొంచెం సేపు ఉంచితే మురికి తొలిగిపోతుంది. ఆభరణాల అంచులను టూత్ బ్రష్‌తో శుభ్ర పరుచాలి. ఆ తరువాత మంచి నీటితో ఆభరణాలను కడిగి పొడి బట్టతో తుడువాలి.
-ఆభరణాలకు టూత్ పేస్ట్ రాసి బ్రష్‌తో అంచులు, మూలల్లో రుద్దాలి. ఆ తరువాత గోరువెచ్చని నీటిలో 10 నిమిషాలు ఉంచి పొడి బట్టతో తుడువాలి. ఇలా చేయడం వల్ల ఆభరణం కాంతి కోల్పోకుండా ఉంటుంది.
-గోరువెచ్చని నీటిలో అమ్మోనియా పొడి వేసి బాగా కలుపాలి. ఈ మిశ్రమంలో ఆభరణాలను వేసి నిమిషం తరువాత టూత్ బ్రష్‌తో రుద్దాలి. అయితే అందులో ముత్యాలు, జెమ్స్ లేకుండా చూసుకోవాలి.
-గోరువెచ్చని నీటిలో కొంచె ఉప్పు వేసి వెండి ఆభరణాలను కొంచెం సేపు అలానే ఉంచాలి. తరువాత టూత్ బ్రష్‌తో అంచులు, మూలాలను రుద్ది మంచి నీటితో కడుగాలి. ఆభరణాలను శుభ్రపరుచడానికి ఇది సులువైన మార్గం.

643
Tags

More News

VIRAL NEWS