చిన్నారుల మెరుపులు!


Fri,October 13, 2017 02:09 AM

దీపావళి సంబురం ముందుంది.. దివ్వెల వెలుగులతో పాటు.. చిన్నారుల బోసినవ్వులు ఉంటే ఆ ఇంటి అందమే వేరు.. ఆ చిన్నారులు దీపాల మధ్య వెలిగిపోవాలంటే.. ఫ్యాషన్ ప్రపంచాన్ని వాళ్లకూ పరిచయం చేయాలి.. బుజ్జి గౌన్లతో.. వారిని మరింత అందంగా తయారు చేయాలి.. అందుకే ఈ వారం చిన్నారుల ఫ్యాషన్స్ మీ ముందుంచాం..

Fashan
ఆరెంజ్, గోల్డ్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ ఫ్రాక్ వేస్తే పిల్లలు ముద్దుగా కనిపిస్తారు. పై వరకు సెల్ఫ్ డిజైన్ వచ్చిన గోల్డ్ నెట్ వాడాం. కింద వైపు ఆరెంజ్ నెట్‌ని కుచ్చులుగా డిజైన్ చేశాం. చివర్లకి గోల్డెన్ శాటిన్ బార్డర్‌ని జతచేశాం. శాటిన్ లైనింగ్‌తో ఫ్రాక్ మరింత అందంగా మెరిసిపోతున్నది.

Fashan1
తెల్లని గౌనులో రాజకుమారిలా మెరిసిపోవాలంటే ఈ గౌన్ వేయాల్సిందే! తెల్లని రా సిల్క్‌తో ఈ గౌన్ కుట్టాం. దీన్ని హై అండ్ లో ప్యాటర్న్‌తో ఈ గౌన్ డిజైన్ చేశాం. ముందు పింక్ కలర్ రాసిల్క్‌తో గులాబీ పువ్వు కుట్టాం. ఇక స్పెషల్ అట్రాక్షన్ కోసం బార్డర్‌లో మొత్తం చిన్న ఎల్‌ఈడీ బల్బులను అమర్చాం.

Fashan3
మీ పాప బుట్ట బొమ్మలా కనపడడానికి ఈ ఫ్రాక్‌ని డిజైన్ చేశాం. పింక్ నెట్ ప్యాబ్రిక్‌తో ఈ గౌను కుట్టాం. బోట్ నెక్‌తో పాటు దాని చుట్టూ చిన్న చిన్న పువ్వులను జత చేశాం. నడుము దగ్గర కూడా లేస్‌తో వచ్చిన పువ్వులను ఇవ్వడంతో అందంగా మెరిసిపోతున్నదీ గౌను.

Fashan2
పిల్లలకు ఏ డ్రెస్ వేసినా అందంగా కనిపిస్తారు. ఈ గౌన్‌కి ప్రత్యేకంగా పైన వరకు బ్లాక్ సీక్వెన్స్ వాడాం. దానికి బటన్స్ ఇచ్చాం. ఇక కిందవైపు 3డీ టెక్చర్ పూల ప్రింట్ ఉన్న ఆర్గంజా ఫ్యాబ్రిక్‌ని వాడం. దాన్ని రెండు లేయర్లుగా డిజైన్ చేసి వాటికి బ్లాక్ సీక్వెన్స్ బార్డర్‌ని జతచేశాం. బ్లూ శాటిన్ లైనింగ్ ఇచ్చాం.

Fashan4
మీ చిన్నారి క్యూట్‌గా కనిపించాలా? అయితే ఈ గౌను వేయాల్సిందే! గోల్డెన్ జ్యూట్ ఫ్యాబ్రిక్‌ని బాడీ వరకు ఉపయోగించాం. కింద రాయల్ బ్లూ కలర్ నెట్ ఫ్యాబ్రిక్ వాడాం. ఇదే నెట్‌తో నడుము భాగంలో చిన్న చిన్న పువ్వులను ఇవ్వడంతో అదిరిపోయే లుక్ వచ్చింది.
Rithika

1221
Tags

More News

VIRAL NEWS

Featured Articles