గుండెకాయకు జామకాయ


Fri,October 13, 2017 02:05 AM

jamakaya
-గుండె సంబంధిత వ్యాధితో బాధపడేవారు రోజూ భోజనంతో పాటు జామకాయను తీసుకోవాలంటున్నారు ఆరోగ్యనిపుణులు. మూడు నెలలపాటు ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుందని చెబుతున్నారు.

-జామపండు తినడం వల్ల శరీరంలో రక్తప్రసరణ సాఫీగా జరిగి ఎలాంటి అనారోగ్యాలు దరిచేరవు.

-యాభై గ్రాముల జామపండు గుజ్జుకు పదిగ్రాముల తేనె కలిపి తీసుకుంటే అలిసిన శరీరానికి శక్తి అందుతుంది.

-రాత్రిపూట భోజనం తర్వాత జామపండు తింటే మెరుగైన జీర్ణక్రియకు తోడ్పడుతుంది. మానసిక ఒత్తిడిని జయించేందుకు జామపండు మంచి ఔషధం.

-రోజూ జామకాయ తినడం వల్ల ప్రొస్టేట్ క్యాన్సర్‌ను అరికట్టవచ్చు. చిగుళ్లు, దంతాలు గట్టిపడుతాయి. జామలో ఉండే విటమిన్ సి చిగుళ్ల నుంచి రక్తస్రావం కావడాన్ని
ఆపుతుంది.
-బాగా పండిన జామపండు నుంచి గింజలు తీసేసి పాలు, తేనె కలుపుకొని తాగితే విటమిన్ సి, కాల్షియం మెండుగా లభిస్తాయి. పెరిగే పిల్లలు, గర్భిణులు ఈ మిశ్రమాన్ని టానిక్‌లా వాడవచ్చు.

-చర్మసంబంధిత వ్యాధులకు, కేశసంరక్షణకు జామపండు మేలు చేస్తుంది.

1807
Tags

More News

VIRAL NEWS

Featured Articles