మారథాన్ చాంపియన్


Fri,October 13, 2017 02:03 AM

ఇతర రంగాల్లో ఎంత ఉన్నతస్థానానికి చేరుకున్నా.. నచ్చిన రంగంలో రాణిస్తేనే మనసుకు తృప్తిగా ఉంటుంది. జీవితానికి సార్థకత లభిస్తుంది. ఈమెది కూడా అలాంటి అనుభవమే. ఇంతకీ ఎవరీమె?
shobha-marathon
కరాద్‌కు చెందిన శోభాదేశాయ్ పోలీసు ఉన్నతాధికారి. థానె డివిజన్‌లో పోలీస్‌ఫోర్స్‌లో విధులు నిర్వర్తిస్తున్నది. ఈమె కేవలం పోలీస్ ఆఫీసరు మాత్రమే కాదు అథ్లెట్ కూడా. కుటుంబ బాధ్యతలు చూసుకునే తల్లి. ఒక పోలీసాఫీసర్‌గా ఉంటూనే అథ్లెట్‌గా తన ప్రతిభను చాటుతూ వండర్ ఉమన్‌గా పేరు తెచ్చుకున్నదామె. చిన్నప్పట్నుంచీ ఆమెకు అథ్లెట్ కావాలనే పట్టుదల. ఎక్కడ ఆటలపోటీలు జరిగినా ఆమె ముందుండేది. ఊళ్లో ఉండే కొండలపై, గుట్టలపై పరుగులు పెడుతూ.. పరుగుల రాణిగా పేరు సంపాదించుకున్నది. అయితే తండ్రి మాత్రం ఆమెను పోలీస్‌ఫోర్స్‌లో చేరేవిధంగా ప్రేరణ కల్పించాడు.

తండ్రి కోరిక మేరకు పోలీస్ ఉద్యోగంలో చేరిన శోభ.. కొన్నాళ్ల పాటు తనలోని అథ్లెట్‌ను దాచిపెట్టింది. కొన్నేళ్ల తర్వాత డిపార్ట్‌మెంట్‌లోని ఉన్నతాధికారుల సహకారంతో మారథాన్స్‌లో పాల్గొనడం ప్రారంభించింది. ఇప్పటివరకు శోభ 85 చాంపియన్‌షిప్స్ గెలిచింది. ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తూనే జాతీయ, అంతర్జాతీయ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్‌లో పాల్గొన్నది. అందుకు కావాల్సిన ఫండ్స్‌ను ఉన్నతాధికారులే భరించి.. ఆమెను ప్రోత్సహించారు. మారథాన్‌లో ఇప్పటికే అనేక రికార్డులను తన పేరిట రాసుకున్న శోభాదేశాయ్ మరిన్ని రికార్డులు సృష్టించేందుకు ముందుకు సాగుతున్నది.

325
Tags

More News

VIRAL NEWS