బాడీ బిల్డర్.. సరితాదేవి


Fri,October 13, 2017 02:02 AM

ఆమెకు 30 సంవత్సరాలు. ఇద్దరు పిల్లలున్నారు. అయినా ఆమె బాడీ బిల్డింగ్‌ను వదులలేదు. ఎందుకంటే దేశానికి ఒక బంగారు పతకం అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నది. ఆమె ఎవరంటే..?
Sarita-Devi
సరితా దేవి.. మణిపూర్‌కు చెందిన ఈ మహిళా బాడీ బిల్డర్.. మూడుసార్లు నేషనల్ చాంపియన్‌గా అవతరించిన మొట్టమొదటి మహిళా. ప్రస్తుతం మనదేశం తరఫున అంతర్జాతీయ పోటీల్లో పాల్గొంటున్న సరితాదేవి ఈ స్థాయికి ఎదుగడానికి ఎన్నో కష్టాలను అనుభవించింది. చిన్నప్పటి నుంచే బాడీ బిల్డింగ్‌ను కెరీర్‌గా ఎంచుకున్నది. 18 ఏళ్లకే మార్షల్ ఆర్ట్స్ క్రీడాకారుడు భోగిరోత్‌ను పెళ్లి చేసుకుంది. ఆయన నేషనల్ లెవల్‌లో కాంస్య పతకం సాధించాడు. వారికి ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత ఆనారోగ్య సమస్యలు వెంటాడడంతో మళ్లీ బాడీ బిల్డింగ్ సాధన చేసి స్టేట్ లెవల్ పోటీల్లో రెండో స్థానంలో నిలిచింది. ఆ తర్వాత జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో దేశం తరఫున పాల్గొన్నది. 2014 నుంచి 2016 వరకూ పోటీల్లో నేషనల్ చాంపియన్‌గా నిలిచింది. 2016లో జరిగిన బ్యాంకాక్ పోటీల్లో కాంస్య పతకం సాధించింది. ప్రస్తుతం 30 ఏళ్లు వచ్చినా, ఇద్దరు పిల్లలు ఉన్నా బాడీ బిల్డింగ్‌ను వదులలేదు సరితా దేవి. దేశానికి బంగారు పతకం అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నాని చెబుతున్నది.

475
Tags

More News

VIRAL NEWS