మెరిసే దంతాల కోసం


Fri,October 13, 2017 02:01 AM

దంతాలు శుభ్రంగా, మెరుస్తూ ఉండాలని ఏవేవో చేస్తుంటారు. నోటి దుర్వాసన, పాచి గురించి హైరాన పడుతుంటారు. అలాంటి వారు ఈ హోం రెమిడీస్‌ని ఓసారి ప్రయత్నించి చూడండి.
Teeths-Clean
-అరకప్పు వేడినీటిలో లవంగాలు వేసి బాగా ఉడికించాలి. ఈ నీటిని రోజులో రెండు మూడు సార్లు పుక్కిలించాలి.
-ఒక కప్పు గోరువెచ్చని నీళ్లలో టీస్పూన్ ఆవనూనె కలుపుకొని పుక్కిలించాలి. అవసరం అనుకుంటే కొద్దిగా దూదిని తీసుకుని చిగుళ్ల, దంతాలపై ఈ నీటిని రుద్దుకోవచ్చు.
-కలబంద గుజ్జు, నిమ్మరసం చెరో టీస్పూన్, కూరగాయల గ్లిజరిన్ 2 టీస్పూన్లను పేస్టులా కలుపాలి. కొద్దిసేపటి తర్వాత ఆ పేస్టుతో బ్రష్ చేసుకోవాలి. ఇలా రోజుకు కనీసం రెండుసార్లు చేస్తే ఫలితం ఉంటుంది.
-ఒక కప్పు నీటిలో టీస్పూన్ ఉప్పు కలుపుకొని రోజూ రెండుసార్లు రెండు నిమిషాల పాటు ఈ నీటిని పుక్కిలించాలి.
-పాపుకప్పు వేడినీటిలో అర టీస్పూన్ నిమ్మరసం కలిపి రోజుకోసారి పుక్కిలించాలి.
-హైడ్రోజన్ పెరాక్సైడ్ 2 టేబుల్ స్పూన్లు, అరకప్పు నీటిని బాగా కలుపాలి. ఈ నీటిని రోజులో రెండుసార్లు పుక్కిలిస్తే ఫలితం ఉంటుంది.

504
Tags

More News

VIRAL NEWS