వాట్సప్!


Fri,October 13, 2017 01:57 AM

ట్వీట్

tweet
శ్రీ శ్రీ రవి శంకర్ @SriSri
రవి శంకర్‌ని ట్విట్టర్‌లో ఫాలో అవుతున్న వారి సంఖ్య 2,716,850
అద్భుతమైన క్షణాలు చాలా విలువైనవి. అవి మీ మనసును ప్రశాంతమైన వాతావరణంలోకి తీసుకెళ్తాయి. దాంతో తెలిసిన లోకం నుంచి తెలియని లోకంలోకి వెళ్తాం.

సమ్‌థింగ్ స్పెషల్

some
కాళేశ్వరం.. ఒకే పానపట్టంపై రెండు శివలింగాల అపురూప ఆలయం. గోదావరి ప్రాణహిత అంతర్వాహిణిగా సరస్వతీ నదుల అమృత సంగమ క్షేత్రం.

కామన్‌మ్యాన్ వాయిస్


దేశం మొత్తం హిందీ భాష మాట్లాడే రాష్ర్టాలు పదమూడు ఉన్నాయి. ఆయా రాష్ర్టాల్లో ఏదైనా జరిగితే అక్కడి పత్రికలు అరుణాచల్‌లో ఇది జరిగింది హర్యానాలో అది జరిగింది అని రాస్తాయి. అంతే తప్ప హిందీ రాష్ర్టాల్లో అలా జరిగిందని రాయవు. మరి మీరెందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అని రాయకుండా తెలుగు రాష్ర్టాలు అని ముడిపెడుతూ రాస్తున్నారు. తెలంగాణ బిడ్డ స్టేట్ ఫస్ట్ వస్తే తెలుగు బిడ్డ అవుతాడు. ఆంధ్రాలో అధికారి దొంగతనం చేస్తే తెలుగు రాష్ర్టాల్లో అవినీతి అని రాస్తారు.
-నజీర్ మహ్మద్
అతన్ని మతమన్నారు. కులమన్నారు. జాతన్నారు. ఇంకా ఎన్నో పేర్లు పెట్టారు. కానీ, అతనో మనిషి అని మాత్రం అందరూ మర్చిపోయారు.
-Pusyami Sagar
కొందరి మాటల చేష్టలు మన ఉనికిని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. కానీ అర్థం చేసుకుంటే అందులోని మర్మం మన కర్మం, కర్తవ్యం తెలియజేస్తాయి.
-Sukanya Beegudem
వ్యవసాయం చేసేవాళ్లను పెళ్లి చేసుకోరు. కానీ పిల్లను ఇయ్యాలే అంటే పొలం ఉండాలి అంటారు. ఏం ఉన్నరు?
-Sunny Journo

ఫేక్ ఆర్ ఫ్యాక్ట్?

FAKE-AND-FACT
ఫేక్ : ప్రభాస్ అనుష్కల నిశ్చితార్థం డిసెంబర్‌లో జరుగనున్నది.
ఫ్యాక్ట్ : ప్రభాస్, అనుష్క శెట్టి పెళ్లి వ్యవహారానికి సంబంధించిన వార్త మరోమారు చర్చకు వచ్చింది. వీరిద్దరూ డిసెంబర్‌లో పెళ్లిచేసుకోబోతున్నారని చిత్రపురిలో గుసగుసలు వినిపించడమే కాదు.. సోషల్‌మీడియాలో పోస్టులు కూడా ప్రత్యక్షమయ్యాయి. బాలీవుడ్ ఫిల్మ్ క్రిటిక్ ఉమర్ సంధు తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ విషయాన్ని పోస్ట్ చేశారు. బాహుబలి అభిమానులకు బ్రేకింగ్ న్యూస్. ప్రభాస్, అనుష్కల నిశ్చితార్థం డిసెంబర్‌లో అంటూ ట్వీట్ చేశారు. ఈ విషయం సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నా.. అటు ప్రభాస్ కానీ ఇటు అనుష్క కానీ ఇప్పటివరకు స్పందించలేదు.

వైరల్ వీడియో


దీపావళి రోజున లక్ష్మీదేవిని ఎందుకు పూజిస్తారు? ఎలా
పూజిస్తారు? ఎందుకు పూజించాలి? ఇలాంటి ఆసక్తికరమైన విషయాలతో కూడిన ఓ వీడియో యూట్యూబ్‌లో ఉన్నది చూడండి.
youtube.com/watch?v=HzaYcxCLOUQ
Published on Oct 11, 2017

షేరింగ్

ఒక హిందూ సన్యాసి తన శిష్యులతో కలిసి ఒక దారి గుండా వెళ్తున్నాడు.
ఒక క్రైస్తవ మత బోధకురాలు తన వాళ్లతో కలిసి అదే దారిగుండా వస్తుంది. ఇద్దరు ఎదురుపడ్డారు. హిందూ సన్యాసి వినయంగా చిరునవ్వుతో నమస్కారం చేశాడు. ఆమె కూడా చిన్న నవ్వు నవ్వి తిరిగి ప్రతి నమస్కారం చేసింది. ఇద్దరూ తమ దారిన తాము వెళ్లిపోయారు. హిందూ సన్యాసిని తన శిష్యుడు ఒకడు ఇలా అడిగాడు.
గురువర్యా పరాయి మతస్తురాలికి నమస్కారం చేశారెందుకు?
అప్పుడు గురువు అక్కడ నేను మతం చూడలేదు. ఆమెలోని ఆదిపరాశక్తిని మాత్రమే చూశాను. మన మత ధర్మం ప్రకారం సృష్టిలోని ప్రతీ ఆడది ఆది పరాశక్తి రూపమే అన్నాడు.

ఇటు ఈమెను తన శిష్యురాలు ఇలా అడిగింది. మదర్ ఆయన మన మతం కాదు కదా! మీరెందుకు ఆ సన్యాసిని చిరునవ్వుతో నమస్కారం చేశారు?. అప్పుడు ఆమె.. పది మంది బాగు కోరేవాడు, తాను ముందుండి సన్మార్గం వైపు దారి చూపేవాడు ఎవరైనా సరే ఆ జీసస్ రూపమే. నేను ఆయనలోని ప్రభు తత్వానికి నమస్కారం చేశాను అన్నది.ఇది మతంలోంచి ప్రపంచాన్ని చూసే పద్ధతి. మత గురువులు తమ శిష్యులకి నేర్పించాల్సిన పద్ధతి.
-ఓ వాట్సప్ మెసేజ్

673
Tags

More News

VIRAL NEWS

Featured Articles