పరమాత్మ దివ్యజ్యోతి!


Fri,October 13, 2017 01:39 AM

bigstockHeart
జీవాత్మ పరమాత్మలో భాగమేనంటారు ఆధ్యాత్మికులు. శాస్త్రబద్ధంగా కూడా ఇది నిజమే అనిపిస్తుంది. విశ్వాంతరాళ భౌతిక తలంలో గణిత శాస్ర్తానికి సంబంధించిన ఒక క్రమమైన పద్ధతి ఉంటుంది. మానసిక తలంలో కూడా మనోశాస్త్ర సంబంధితమైన పద్ధతి ఒక క్రమమైన విధానంలో ఉంటుంది. గణిత శాస్త్రం గానీ, మనోశాస్త్రం గానీ వాటి వెనుక విజ్ఞానం ఉంది. ఈ విజ్ఞాన ప్రభావంతోనే అవి ఒక క్రమపద్ధతిలో ఉన్నాయి. విజ్ఞానం అంటే జ్ఞాన జ్యోతి. ఇకపోతే భగవంతుని అనంతమైన శక్తికీ విజ్ఞానం ఉంది. ఆ విజ్ఞాన ప్రభావంతోనే ఈ జగత్తు అంతా పోషింపబడుతూ ఉంది.

ఇందుకు ఎందరో రుషులు, భక్తుల అస్తిత్వం నిదర్శనంగా ఉంది. అదేవిధంగా జీవుడి హృదయాంతరాళంలో ఒక దివ్యమైన తేజస్సు ప్రకాశిస్తూ ఉంటుంది. ఈ తేజోకాంతిని తెలుసుకోవాలంటే ధర్మబద్ధమైన భక్తి, విశ్వాసం, దివ్య సంకల్పం పెంపొందాలి. అలా నిష్కళంకం అయిన మనస్సుకే జీవాత్మలో పరమాత్మ గోచరిస్తాడు. జ్ఞానజ్యోతితో మనసులోని చీకట్లు తొలగిపోయి, స్వచ్ఛమైన వెలుగులు ప్రకాశిస్తే అప్పటివరకూ కంటికి తెలిసీ తెలియనట్లుగా కనిపించే పరమాత్మ దివ్యజ్యోతిలాగా ప్రకాశిస్తుంది. ఆ దీపపు వెలుగులతో జీవితం ఆనందమయం అవుతుంది.
- స్వామి జ్యోతిర్మయానంద

400
Tags

More News

VIRAL NEWS