పర్‌ఫ్యూమ్‌తో.. ఆత్మవిశ్వాసం


Thu,January 17, 2019 01:54 AM

ఎవరికి నచ్చిన సెంట్‌ను వాళ్లు వాడుతుంటారు. పర్‌ఫ్యూమ్‌ల ఎంపికను బట్టి వ్యక్తిత్వాన్ని తెలుసుకోవచ్చు. ఒకరికి పర్‌ఫ్యూమ్ గిఫ్ట్‌గా ఇవ్వాలన్నా వాళ్ల వ్యక్తిత్వాన్ని బట్టి ఇస్తేనే వాళ్లకు నచ్చుతుందట..
perfume
పర్‌ఫ్యూమ్స్ ముఖ్యంగా ఫోర్లల్, ఓరియంటల్, ఉడ్స్, చెప్రీ రకాలుంటాయి. ఇతరులకు బహుమతిగా ఇవ్వడానికైతే వాళ్లకు తగ్గట్టువి కొనాలి. ఉదాహరణకు తల్లిదండ్రులకు ఒక సెంట్ బాటిల్ బహుమతిగా ఇవ్వాలనుకున్నప్పుడు.. వెనీలా, వైట్ మాస్క్ కాంబినేషన్ తీసుకోవాలి. ఇది వాళ్లలో ఒక రకమైన ఆత్మవిశ్వాసాన్ని నింపే పరిమళాన్ని వెదజల్లుతుందట. దగ్గరి మిత్రులకు అయితే.. రోజ్, బ్లాక్ కరెంట్ పర్‌ఫ్యూమ్స్ ఇస్తే హుందాగా ఉంటుంది. మనసుకు నచ్చిన వారికి మీ ప్రేమను తెలియజెప్పడానికి సిడార్, లెమన్, ఓక్‌మాస్, మాండరిన్ సెంట్‌లను గిఫ్ట్‌గా ఇవ్వొచ్చు. దీంతో పాటు మన డ్రెస్సింగ్ స్టయిల్ ఎలా మన వ్యక్తిత్వాన్ని తెలుపుతుందో పూసుకునే పర్‌ఫ్యూమ్ కూడా వ్యక్తిత్వాన్ని తెలుపుతుంది. లెమన్, జామ చెట్లనుంచి తయారు చేసిన సెంట్లు మనలో సృజనాత్మకతను పెంచుతాయి. మానసికంగా దృఢంగా ఉండేవారు, నలుగురితో కలిసే చొరవ ఉన్న వారు ఇలాంటి పరిమళాలు వాడుతారు. గులాబి వంటి సున్నితమైన సెంట్లు వాడేవారు ఎప్పుడూ డైలమాలో ఉంటారట. ఘాటైన పరిమళాలు వాడేవారు కొత్తకొత్త దారుల్లో ఆలోచించి ముందుకెళ్తారట.

662
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles