వారు గాలిని తింటున్నారు!


Thu,January 17, 2019 01:46 AM

మీరు.. గాలిని తింటారా? పోనీ.. వేడి వేడిగా వేయించిన గాలి అయితే ఓకేనా? మీ ఇష్టం, నిర్ణయం మీదే! ఏంటి? గాలిని తినడమేంటని ఆశ్చర్యపోతున్నారా? వినడానికి కొంచెం చిత్రంగానే ఉన్నా.. అక్కడ మాత్రం గాలిని ఆవురావురుమని ఆరగిస్తున్నారు.
Air-eating
ఔను, మీరు విన్నది నిజమే. అక్కడ గాలిని ఆహారంగా వడ్డిస్తారు. దానిని వేడి వేడిగా ఆరగిస్తుంటారు. ఇదేం విడ్డూరం? గాలిని ఎవరైనా తింటారా? దాన్ని నూనెలో వేయించగలుగుతారా? అని సందేహించకండి. ఇటలీలోని క్యాస్టెల్‌ఫ్రాంకో వెనెటో నగరంలోని ఫెవా రెస్టారెంట్‌కు వెళ్లాల్సిందే. ఎందుకంటే ఇక్కడ స్వచ్ఛమైన గాలి కోరుకునేవారికి.. ఆ గాలినే ఆహారంగా వడ్డిస్తున్నారు. మా రెస్టారెంట్‌కు రండి, కడుపు నిండా గాలిని ఆరగించి వెళ్లండి అని రెస్టారెంట్ నిర్వాహకులు కోరుతున్నారు. మొదట్లో వింతగానే ఉన్నా..ఇప్పుడు చాలా ఫేమస్. ఈ గాలి వంటకాన్ని ఎరియా ఫ్రిట్టా, ఫ్రైడ్ ఎయిర్ అని పిలుస్తున్నారు. వీటిని ఎలా తయారు చేస్తారంటే.. కర్రపెండలం దుంప పైపొరను గుండ్రంగా చుట్టి కాసేపు మైక్రో ఓవెన్‌లో పెడతారు. అది గట్టిపడిన తర్వాత నూనెలో వేపుతారు. ఆ తర్వాత వాటిని ఒక పాత్రలోకి తీసుకుని ఓజోన్ గాలిని నింపుతారు. అలా సుమారు 10 నిమిషాల పాటు గాలి పంపుతారు. ఇందులో ప్రత్యేకమైన, ఆరోగ్యకరమైన పెర్‌ఫ్యూమ్‌ను వాడతారు. ఆ తర్వాత వాటిని దూదిపై ఉంచి కస్టమర్లకు వడ్డిస్తారు. ఆ దూదిని వాళ్లు మేఘాలుగా పేర్కొంటారు. దీని ధర 30 అమెరికా డాలర్లు (మన కరెన్సీలో రూ.2,011). ఈ ఫ్రైడ్ ఎయిర్‌ను మొదట్లో ఉచితంగానే ఇచ్చేవారు. వీటికి బాగా డిమాండ్ పెరగడంతో రెగ్యులర్ మెనూలో దీన్ని చేర్చారు. ఇంకెందుకు ఆలస్యం మీరెపుడైనా ఇటలీకి వెళ్తే.. ఈ గాలి ఆహారాన్ని రుచి చూడండి.

463
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles