కొబ్బరిపాలు ఎంతో మేలు!


Thu,January 10, 2019 01:08 AM

skincare
-గోరువెచ్చని నీటిలో కొంచెం కొబ్బరిపాలు, రోజ్‌వాటర్ కలుపాలి. ఈ మిశ్రమాన్ని స్నానానికి వాడాలి. ఇలా చేయడం వల్ల పాడైన చర్మం కూడా తిరిగి తాజాదనాన్ని సంతరించుకుంటుంది.
-కొబ్బరిపాలను చర్మానికి రాసి ఐదు నిమిషాల పాటు మర్దన చేయాలి. 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మానికి తేమ అందడంతో పాటు మృదువుగా మారుతుంది.
-గులాబీ రేకులు, తేనె, కొబ్బరిపాలను గోరువెచ్చని నీటిలో కలుపుకొని స్నానం చేయాలి. దీనివల్ల శరీరానికి తగిన తేమ అంది మేని కాంతివంతంగా తయారవుతుంది.
-కొబ్బరిపాలల్లో కొంచెం నిమ్మరసం వేసి బాగా కలుపాలి. దూదితో ఈ మిశ్రమాన్ని ముఖానికి రాయాలి. ఆరిన తర్వాత కడిగేస్తే చర్మంపై ఉన్న మురికి తొలిగిపోయి చర్మం తాజాగా మారుతుంది.
-కొబ్బరిపాలు, బాదం పొడి, తులసి పొడి, తేనెలను బాగా కలుపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించాలి. 20 నిమిషాల తర్వాత నీటితో కడుగాలి. తరచూ ఇలా చేస్తే చర్మం మృదువుగా మారుతుంది.

665
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles