విమానంలో ఒక్కరే ఉంటే!


Thu,January 3, 2019 12:42 AM

ఒక విమానంలో ఒక్కరే ప్రయాణం చేయాల్సి వస్తే ఎలా ఉంటుంది? ఒకవైపు భయం వేసినా, మరోవైపు థ్రిల్లింగ్‌గా ఉంటుంది. ఇలాంటి అరుదైన అవకాశం ఒక అమ్మాయిని వరించింది. ఇంతకీ ఎవరా అమ్మాయి?
plane
తన పేరు లూయీసా ఎరిస్పే. గతేడాది డిసెంబర్ 24న దావోస్ నుంచి మనీలాకు వెళ్లేందుకు పీఆర్ 2820 విమానంలో టికెట్ బుక్ చేసుకున్నది. ప్రయాణ సమయం రానే వచ్చింది. విమానంలోకి ఎంటర్ అయింది. లోపలికి వెళ్లి చూడగా విమానం అంతా ఖాళీగా ఉన్నది. అక్కడ సిబ్బంది తప్ప, ఒక్క ప్రయాణికుడు కూడా లేడు. దీంతో లూయీసా ఖంగు తిన్నది. విమానంలో తాను ఒక్కతే అని విమానం ఎక్కాక తెలిసింది. లూయీసా మొదట్లో కంగారుపడినప్పటికీ.. ఆ తర్వాత అంతా సర్దుకున్నది. ఇంకేముంది భయం పోయింది. విమానానికి తానే మహారాణి అన్నట్టు ఆడి పాడింది. అక్కడి సిబ్బిందితో సెల్ఫీలు తీసుకుంటూ చాలా ఎంజాయ్ చేసింది. ఆ ఫొటోలను తన ఫేస్‌బుక్ పేజ్‌లో పోస్ట్ చేయడంతో పోస్ట్ కాస్త వైరల్ అయింది. విమానానికి మహారాణి అంటూ తన ఆనందాన్ని ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టింది. గమ్యస్థానానికి చేరుకోగానే విమాన సిబ్బిందికి కృతజ్ఞతలు తెలిపింది. ఎంతమంది విమానంలో ఉన్నారనేదాన్ని పట్టించుకోకుండా ఒక్కరినైనా సరే గమ్యస్థానానికి చేర్చడంలో ఫిలిప్పీన్స్ ఎయిర్‌లైన్స్ సంస్థ ఎంతటి కమిట్‌మెంట్‌తో పనిచేస్తుందో అని చెప్పడానికి ఈ సంఘటన నిదర్శనమని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

611
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles