స్నేహం కోసం కిడ్నీ దానం!


Thu,December 6, 2018 01:47 AM

స్నేహితులు చాలామందే ఉంటారు. కానీ, ఆపద సమయాల్లో ప్రాణాలు పెట్టే స్నేహితులు అతి కొద్దిమందే ఉంటారు. అలాంటి స్నేహతురాలి కథే ఇది. కిడ్నీలు పాడయి, ఇబ్బందులు ఎదుర్కొంటున్న తన ప్రాణ స్నేహితురాలికి కిడ్నీని దానం చేసేందుకు ముందుకొచ్చింది. మంచి మనసుకు మతం అడ్డురావడంతో ఎన్నో అడ్డంకులు ఎదుర్కొంటూ, ఆత్మైస్థెర్యంలో తన దోస్త్ కోసం పోరాడుతున్నది.
Manjot-Singh-Kohli
జమ్మూకశ్మీర్ చెందిన మన్ సింగ్ కోహ్లీ, ముస్లిం యువతి సమ్రీన్ ప్రాణ స్నేహితులు. దాదాపు నాలుగేండ్ల నుంచి వీరి స్నేహం కొనసాగుతున్నది. వీరిద్దరూ కలిసి పలు సామాజిక, సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. మన్ ‘ఇంటర్నేషనల్ యాంటీ కరెప్షన్ అండ్ హ్యుమన్ రైట్స్ కౌన్సిల్’ అనే ఎన్జీఓకు చైర్ పిన్న వయస్కురాలైన వ్యాపారవేత్త కూడా. అయితే కొన్నాళ్ల క్రితం సమ్రీన్ కిడ్నీ ఒకటి పాడైంది. ఆ విషయం మన్ చెప్పకుండానే డయాలసిస్ చేయించుకుంటున్నది. కొద్దిరోజులకు మన్ విషయం తెలియడంతో తన కిడ్నీ ఇచ్చేందుకు సిద్ధమైంది. అయితే ఆమె తల్లిదండ్రులు మాత్రం మన్ కిడ్నీ ఇచ్చేందుకు నిరాకరించారు. మరికొంతమంది ముస్లిం యువతికి కిడ్నీ ఇవ్వమేంటని వాదించారు.

అయినా అవేమీ లెక్కచెయ్యకుండా శ్రీనగర్ స్కిమ్స్ ఆస్పత్రిలో సమ్రీన్ డయాలసిస్ చేయిస్తున్నది. సమ్రీన్ తండ్రి ముక్తార్ అహ్మద్ మాలిక్ సాధారణ టైలర్. ఉన్నదంతా కూతురి చదువుకే ఖర్చు చేశాడు. ఆపరేషన్ అయ్యే రూ.8 లక్షల ఖర్చును భరించలేని స్థితిలో ఉన్నాడు. సమ్రీన్ తల్లిదండ్రుల ఆరోగ్యం సరిగా లేకపోవడంతో వారు కిడ్నీదానానికి అనర్హులయ్యారు. ఈ క్రమంలో వారి కుటుంబానికి అండగా నిలిచిందీ స్నేహితురాలు మన్ స్కిమ్స్ ఆసుపత్రి సూపరిండెంట్ మాట్లాడి ‘తాను మేజర్ అని, స్వతాహగా నిర్ణయాలు తీసుకునే హక్కు ఉందని, ఆపరేషన్ ఏర్పాట్లు చెయ్యండి’ అంటూ విజ్ఞప్తి చేసింది. అయితే ఆసుపత్రి సిబ్బంది మాత్రం తల్లిదండ్రుల అనుమతి కావాలని అంటున్నారు. దీంతో తన స్నేహితురాలిని కాపాడుకునేందుకు చేతనైన ప్రయత్నాలు చేస్తున్నది మన్ సింగ్. ఈ విషయం తెలిసిన ఎంతోమంది వారి స్నేహితురాళ్లకు అభినందనలు తెలుపుతున్నారు.

592
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles