మోకాలు కీలు మార్పించుకోవాలా?


Thu,December 6, 2018 01:45 AM

మా అత్తయ్య వయసు 65 సంవత్సరాలు. ఆమె మోకాలు నొప్పితో బాధపడుతున్నారు. అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి. డాక్టర్ సంప్రదిస్తే మోకాలు కీలు మార్పిడి చికిత్స అవసరమని తెలిపారు. కానీ మా అత్తయ్య శస్త్రచికిత్స అంటే చాలా భయపడుతున్నారు. మరి ఎలా? ఏమైనా ప్రత్యామ్నయం ఉందా? మోకాలు కీలు మార్పిడి శస్త్ర చికిత్సకు ఉన్న అత్యాధునిక పద్ధులు ఏంటి? వాటి ప్రత్యేకత ఏంటి? దయచేసి తెలుపగలరు.
- ఎ. పద్మ, ఖమ్మం

Councelling
పద్మగారూ.. మోకాళ్ల నొప్పులు ప్రస్తుతం సర్వ సాధారణం అయ్యాయి. మీ అత్తయ్య వయసు 65 సంవత్సరాలు కాబట్టి ఆ వయసు వారికి మోకాలు కీలు నొప్పులు రావడంలో ఆశ్చర్యం లేదు. అయితే చికిత్స చేయించాలన్న ఆలోచన చాలా మంచిది. ఈ విషయంలో మిమ్మల్ని అభినందించాల్సిందే. కీళ్ల నొప్పులు అనేవి ఏ వారం రోజులో.. పది రోజులో ఉండవు. ఇవి ఒకసారి వస్తే చాలా ఇబ్బందికి గురిచేస్తాయి. ఆ నొప్పితో ఒక్కోసారి వంద అడుగులు కూడా నడువలేరు. నొప్పి నివారణకు.. ఉపశమనానికి మందులు వాడితే కొంచెం ఫలితం ఉంటుంది.

అయినా ఉపశమనం కలగనప్పుడు ఎక్స్ తీయించాలి. కీలు అరిగినట్లు నిర్ధారణ చేస్తే మాత్రం కచ్చితంగా శస్త్రచికిత్స అవసరం ఉంటుంది. మోకాలు వంకర్లు పోయినవారిలో.. అరుగుదల ఎక్కువగా ఉన్నవారిలో కీలు అమరిక తప్పనిసరి. అంటే మీ అత్తగారికి కూడా మోకాలు కీలు మార్పిడి చేయించాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్ కీలు మార్పిడి కోసం ఆధునిక శస్త్రచికిత్స విధానాలు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి మీరు ఎంతమాత్రం ఆలస్యం చేయకుండా మంచి నిపుణులైన వైద్యుడిని సంప్రదించి మీ అత్తగారి సమస్యకు పరిష్కారం చేయండి. మంచి పౌష్టికాహారం అందించండి.

డాక్టర్ ప్రవీణ్ మేరెడ్డి
కన్సల్టెంట్ ఆర్థోపెడికి సర్జన్
కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్

196
Tags

More News

VIRAL NEWS