వాముతో వావ్ అనాల్సిందే!


Thu,December 6, 2018 01:43 AM

చాలామంది నిద్రలేమి సమస్యలతో బాధపడుతుంటారు. దీని కారణంగా ముఖంపై మొటిమలు, నల్లటి వలయాలు ఏర్పడుతుంటాయి. ఆరోగ్యానికి మేలు చేసే వాము అందానికీ మేలు చేస్తుంది.
skincare
-వాముపొడి, వంటసోడా, శనగపిండి, పాల మీగడ కలిపి పేస్ట్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాయలి. 20 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో కడుగాలి. వారానికి రెండుసార్లు ఇలా చేస్తే మొటిమలు తొలిగిపోతాయి.
-జాజికాయని నూరి వచ్చిన గంధానికి కొంచెం వాముపొడి, పాలు కలుపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాయాలి. 40 నిమిషాల తరువాత చల్లని నీటితో శుభ్రం చేయాలి. తరుచూ ఇలా చేస్తే నల్లటిమచ్చలు పోతాయి.
-వాముని నూనెలో వేయించి మెత్తని చూర్ణంగా చేయాలి. దీనిలో కొంచెం పెరుగు కలిపి ముఖానికి రాయాలి. 15 నిమిషాల తరువాత శుభ్రం చేసుకుంటే చర్మం మృదువుగా ఉంటుంది.
-కొబ్బరినీటిలో కొంచెం పెరుగు, నిమ్మరసం, తేనె కలుపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాయాలి. 30 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో కడుగాలి. వారానికి రెండుసార్లు ఇలా చేస్తే చర్మం పొడిబారకుండా ఉంటుంది.
-మిరియాలు నానబెట్టిన నీటిలో కొంచెం నిమ్మరసం కలుపాలి. ఈ నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా తరుచూ చేస్తే ముడుతల చర్మం తొలిగిపోతుంది.

556
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles