చెమట మరక పడిందా?


Thu,December 6, 2018 01:41 AM

చలికాలంలో ఎంత చలి ఉన్నా.. బయటికి వెళితే చెమట పడుతుంది. చెమట మరకలతో నలుగురిలోకి వెళ్లాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఈ మరకలను సులువుగా ఎలా తొలిగించాలో తెలుసా?
shirt
-బకెట్ నీటిలో కొంచెం నిమ్మరసం కలుపాలి. ఈ నీటిలో బట్టలను 30 నిమిషాల పాటు నానబెట్టాలి. దీంతో చెమట మరకలు తొలిగిపోవడమే కాకుండా మంచి వాసన వచ్చేలా చేస్తాయి.
-చెమట మరకలను తొలిగించాలంటే బ్రష్ చేయడం కంటే చేతితో రుద్దడమే మంచిది. చెమట దుస్తులు రసాయనాలు, ఉప్పుని కలిగి ఉంటాయి. చెమట దుస్తులకు పటుత్వం పోయేలా చేస్తుంది.
-చెమటమరకలు చర్మానికి హాని చేస్తాయి. దురద, మంటలు ఏర్పడుతాయి. చెమట బట్టలను ఎండలో వేయడం వల్ల ఫంగస్ చేరకుండా ఉంటుంది.
-కొన్ని దుస్తులు నీటిలో నానబెట్టడం వల్ల రంగు కోల్పోతాయి. దుస్తులను ఉప్పు నీటిలో నానబెడితే వాటికి రంగు పోకుండా ఉంటుంది.

480
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles