స్పాండిలైటిస్ నివారణకు..


Thu,October 11, 2018 12:21 AM

మారిన జీవన విధానం కారణంగా స్పాండిలైటిస్ రోజురోజుకూ పెరిగిపోతున్నది. వయసు, లింగ భేదాలతో సంబంధం లేకుండా అన్ని వయసుల వారికీ వస్తున్నది. దీనిని నివారణకు పోషక విలువలతో కూడిన ఆహారమే సరైందని న్యూట్రిషియనిస్టులు చెప్తున్నారు.

Nutrian-Cillumn
-స్పాండిలైటిస్ ఉన్నవారు వ్యాయామం, మెడిటేషన్, యోగా, పోషక విలువలతో కూడిన ఆహారంతో ఈ బాధకు చెక్ చెప్పొచ్చు.
-ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ స్పాండిలైటీస్‌పై ప్రభావం చూపగలదని ఎన్నో అధ్యయనాలు చెబుతున్నాయి. ఇవి ఎక్కువగా ఉండే అవిసె గింజలు, వాల్నట్స్, చేపలను తరచూ ఆహారంలో భాగంగా తీసుకోవాలి.
-ప్రతి వారమూ వివిధ రకాల గ్రీన్ వెజిటెబుల్స్‌ను ఆహారంలో భాగం చేసుకోవాలి. వాటితో పాటు పండ్లనూ రోజూ తినాలి. ఇలా చేయడం వల్ల శరీరానికి కావల్సిన విటమిన్స్, మినరల్స్ అందుతాయి. కూరగాయలను ఎక్కువగా తీసుకోవడం వల్ల అధిక కేలరీలు అందుతాయి.
-గట్ లైనింగ్ పెంచేందుకు పెరుగులో అరటి పండును తీసుకోవాలి. రోజూ అరటిపండ్లు తినడం వల్ల గట్ లైనింగ్‌కు రక్షణ ఏర్పడుతుంది.

Nutrian-Cillumn1
-ఆహారంలో తృణధాన్యాలను కూడా భాగం చేసుకోవాలి. ఇవి నొప్పి నివారణకు బాగా పనిచేస్తాయి.
-క్యాల్షియం అధికంగా ఉండే పాలు, జున్ను, ఆల్మండ్స్, పప్పు ధాన్యాలు, సోయాబీన్స్‌ను తీసుకోవాలి.
-వీటితో పాటుగా ఆక్సాలిక్ యాసిడ్స్ అధికంగా ఉండే పాలకూర, మాంసం, గుడ్లు, చికెన్ వంటివి పరిమితంగా తీసుకోవాలి.
-ఉప్పు తగ్గించి వాడడం, కాఫీ, పొగాకు, మద్యం, సాఫ్ట్‌డ్రింక్స్‌ను పూర్తిగా మానుకుంటే ఆరోగ్యానికి మంచిది.
డాక్టర్ మయూరి ఆవుల
న్యూట్రిషియనిస్ట్
[email protected]

1097
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles