వావ్.. వంటలు!


Thu,July 12, 2018 01:21 AM

Food
ఎప్పుడూ అవే తాలింపులు.. వేపుళ్లు లేకపోతే గ్రేవీలు.. అవే మసాలా దట్టింపులు.. అవే తింటే జిహ్వ చప్పబడి.. చతికిలబడి పోతుంది.. ఇంతకు మించి వంటలపై ప్రయోగాలకు పోలేమా? వెళ్లొచ్చు.. అందుకే ఈవారం సరికొత్త వంటకాలతో వచ్చాం.. మీతో వావ్ అనిపించాలని సరికొత్త వంటకాలను మీ ముందుంచుతున్నాం..

జెర్క్ చికెన్

jerk-chicken

కావాల్సినవి :

చికెన్ బ్రెస్ట్ : 2, చికెన్ బోన్స్ : 2, ఉల్లి ఆకు : 2 కట్టలు,
సోయా సాస్ : 2 టేబుల్‌స్పూన్స్, పార్సిలీ : అర కప్పు,
థైమ్ : 10 రెమ్మలు, మిరియాలు : పావు టీస్పూన్, గరం మసాలా : పావు టీస్పూన్, నిమ్మకాయ : 1, ఆరెంజ్ : 1, బ్రౌన్ షుగర్ : 1 టేబుల్‌స్పూన్, అల్లం తురుము : ఒక టీస్పూన్, చిన్న ఎర్ర మిరపకాయ : 2, క్యాప్సికం : 2 (ఎరుపు, పసుపు), నూనె, ఉప్పు : తగినంత.

తయారీ :

ఉల్లి ఆకులు, సోయాసాస్, పార్సిలీ, థైమ్, మిరియాలు, గరం మసాలా పొడి, ఆరెంజ్, బ్రౌన్ షుగర్, అల్లం తురుము, మిరపకాయలు అన్నీ మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. వీటిని చికెన్ ముక్కలకు పట్టించి రెండు గంటల పాటు అలాగే ఉంచాలి. వీటిని గ్రిల్‌లో ఉంచి పై నుంచి కాస్త నూనె పోసి బాగా కాల్చుకోవాలి. బయటకు తీశాక నిమ్మరసం పిండి, క్యాప్సికాన్ని అందంగా కట్ చేసి గార్నిష్ చేయాలి. వేడిగా ఈ ముక్కల్ని తినేయాలి.

గ్రిల్డ్ ల్యాంబ్

gilled-lamb

కావాల్సినవి :

మటన్ : 250 గ్రా.
నిమ్మరసం : 2 టేబుల్‌స్పూన్స్
కారం : ఒక టీస్పూన్
పుదీనా పొడి : ఒక టీస్పూన్
ఉల్లిగడ్డ : 1
ధనియాల పొడి : ఒక టీస్పూన్
పెరుగు : 4 టేబుల్‌స్పూన్స్
ఆలివ్ ఆయిల్ : 2 టేబుల్‌స్పూన్స్
మిరియాలు : పావు టీస్పూన్
ఆవాలు : 5 గ్రా.
కీరా తురుము : 10 గ్రా.
వేయించిన ఉల్లిపాయ
ముక్కలు : ఒక టేబుల్‌స్పూన్
వేయించిన వెల్లుల్లి : 5
పుదీనా : చిన్న కట్ట
ఉప్పు : తగినంత.

తయారీ :

ఒక గిన్నెలో రెండు టేబుల్‌స్పూన్ల పెరుగు తీసుకోవాలి. దాంట్లో ఆవాలు, కీరా తురుము, వేయించిన వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు, పుదీనా, ఉప్పు కలిపి పక్కన పెట్టాలి. మటన్‌ని చిన్న ముక్కలుగా కట్ చేసి దాంట్లో కారం, నిమ్మరసం, పుదీనా పొడి, ధనియాల పొడి, పెరుగు, ఆలివ్ ఆయిల్, మిరియాల పొడి, ఉప్పు వేసి కలిపి రెండు గంటల పాటు పక్కన పెట్టాలి. గ్రిల్ రెడీ చేసుకొని ఈ ముక్కలను సీకులకు గుచ్చి గ్రిల్ చేసి బాగా కాల్చుకోవాలి. పై నుంచి వేయించిన ఉల్లిపాయ ముక్కలతో, పుదీనాతో గార్నిష్ చేయాలి. దీన్ని పెరుగు మిశ్రమంతో కలిపి తింటే యమ టేస్టీగా ఉంటుంది.

గ్రిల్డ్ వాటర్ మిలన్

grilled-watermelon

కావాల్సినవి :

పుచ్చకాయ : 150 గ్రా.
సెలరీ సాల్ట్ : 5 గ్రా.
పైనాపిల్ : 100 గ్రా.
ఆలివ్ ఆయిల్ : 40 మి.లీ.
ఫెటా చీజ్ : 30 గ్రా.
పొన్నగంటి కూర : 20 గ్రా.

తయారీ :

పుచ్చకాయలోని గింజలను తీసేసి రెండు అంగుళాల ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇందులో ఆలివ్ ఆయిల్, సెలరీ సాల్ట్ వేసి సీకులకు గుచ్చి గ్రిల్ చేసి పక్కన పెట్టాలి. ఒక గిన్నెలో పైనాపిల్‌ని చిన్న ముక్కలుగా కట్ చేయాలి. దీంట్లో ఫెటా చీజ్‌ని మెత్తగా చూసి బాగా కలిపి డంప్లింగ్‌లా చేయాలి. వీటిని కడాయి పెట్టి వేయించుకోవాలి. ఇప్పుడు గ్రిల్ చేసిన పుచ్చకాయ ముక్కలు పెట్టి కాస్త సెలరీ సాల్ట్ వేయాలి. పైన ఈ డంప్లింగ్‌ని ఉంచాలి. పక్కన పొన్నగంటి కూరతో అందంగా గార్నిష్ చేసి సర్వ్ చేయాలి.

గాజ్‌పచో

gazpacho

కావాల్సినవి :

ఇంగ్లిష్ కుకుంబర్ : 8, చల్లనీళ్లు : అర కప్పు, స్వీట్ ఆనియన్ : చిన్న ముక్క, నిమ్మరసం : 3 టేబుల్‌స్పూన్స్, పుదీనా : చిన్న కట్ట,
కొత్తిమీర : చిన్న కట్ట, అల్లం తురుము : ఒక టీస్పూన్, కారం : అర టీస్పూన్, పుచ్చకాయ ముక్కలు : 2 కప్పులు, ఆలివ్ ఆయిల్ : తగినంత, ఉప్పు : 2 టీస్పూన్స్.

తయారీ :

పైన చెప్పిన వాటిలో పుదీనా తప్ప అన్నీ మిక్సీలో వేసి గ్రైండ్ చేయాలి. ఈ జ్యూస్‌ని రెండుగంటల పాటు ఫ్రిజ్‌లో పెట్టి తీయాలి. పై నుంచి పుదీనా ఆకులతో గార్నిష్ చేసి చల్లగా సర్వ్ చేయాలి.

స్మోక్డ్ సాల్మన్

smoke-solmon

కావాల్సినవి :

సాల్మన్ చేపలు : 3 ైస్లెస్‌లు
కాలీఫ్లవర్ : 100 గ్రా.
ఆప్రికాట్ : 4, ఆలివ్స్ : 4
ఆలివ్ ఆయిల్ : 50 మి.లీ.
పెరుగు : 40 గ్రా., క్రీమ్ : 15 మి.లీ.
తేనె : ఒక టీస్పూన్,
నిమ్మరసం : 15 మి.లీ.,
ఉప్పు : తగినంత.

తయారీ :

కాలీఫ్లవర్‌ని కట్ చేయాలి. దీన్ని క్రీమ్‌లో ముంచి దాన్ని గిన్నె ఆకారంలో మలిచి పెట్టుకోవాలి. ఈలోపు సాల్మన్ చేపలను కొద్దిగా ఆలివ్ ఆయిల్ వేసి ఓవెన్‌లో బేక్ చేసి తీయాలి. దీన్ని పువ్వులా మలిచి కాలీఫ్లవర్ మధ్యలో ఉంచాలి. ఆప్రికాట్, ఆలివ్‌ని ఒక గిన్నెలో తీసుకొని అందులో నిమ్మరసం, తేనె, ఉప్పు కలిపి కాసేపు అలాగే ఉంచాలి. వీటిని చేప ముక్కలపై పెట్టి గార్నిష్ చేసి సర్వ్ చేయాలి. రుచికరమైన స్మోక్డ్ సాల్మన్ రెడీ!

వరుణ్
ఎగ్జిక్యూటివ్ చెఫ్
నోవాటెల్
హైదరాబాద్
ఎయిర్‌పోర్ట్

655
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles