మైదాతో మధుమేహం


Thu,June 14, 2018 12:20 AM

మైదాపిండితో రకరకాల ఆహారపదార్థాలను తయారుచేస్తుంటారు. కానీ ఆ పిండితో మధుమేహం తప్పదంటున్నారు ఆరోగ్యనిపుణులు.
Maida
మైదాపిండిలో కలిపే రసాయనాల వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయంటున్నారు నిపుణులు. ఈ పిండిలో కార్బోహైడ్రేట్లు అధిక స్థాయిలో ఉంటాయి. కానీ పోషకాలు మాత్రం చాలా తక్కువ మోతాదులో ఉంటాయట. మైదాపిండి తయారీలో కలిపే ఫోలిక్ యాసిడ్ వల్ల మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. ఇందులో ఉండే అధిక పొటాషియం శరీర కణాలకు మంచిది కాదు. హానికారకమైన ప్రభావాలను కలుగచేసే అల్లాక్సాన్ మైదాలో ఎక్కువగా ఉంటుంది. మైదాను ఉపయోగించి చేసే పిజ్జా, కుకీస్, పాస్తా, ఫాస్ట్‌ఫుడ్స్ తీసుకోకపోవడమే ఆరోగ్యానికి మంచిదని హెచ్చరిస్తున్నారు నిపుణులు. క్యాన్సర్ వ్యాధికి కూడా ఈ మైదా కారణం అవుతుంది. కాబట్టి ఆరోగ్యాన్ని పాడుచేసే మైదాని తక్కువ మోతాదులో తీసుకోండి.

551
Tags

More News

VIRAL NEWS