ప్రేమ అను కొవ్వు!


Thu,December 7, 2017 01:48 AM

అవును.. మీ ప్రేమ మీ వాళ్లలో కొవ్వును పెంచుతుంది! అదెలాగంటే..?
Love-Fat
ఇద్దరి మధ్య ప్రేమ ఉంటే సుఖసంతోషాలతో ఉంటాం.. కానీ ఆ ప్రేమ ఎక్కువైతే కొంచెం కొవ్వు పెరుగుతుంది అంటున్నారు సౌథర్న్ మెథడిస్ట్ యూనివర్సిటీ నిపుణులు. ప్రేమికులు.. కొత్తగా పెండ్లయిన జంటలు.. అన్యోన్యంగా ఉండే దంపతులు.. ప్రేమగా ఉండే అత్తాకోడళ్ల మధ్య ఉన్న ప్రేమ క్రమంగా ఆహార ప్రేమగా మారుతుందట. తమ ప్రేమను తిండిలో చూపించడం వల్ల రోజురోజుకూ కొవ్వు పెరిగిపోతుందట. ఇష్టం లేకపోయినా.. ఒక్క ముద్ద.. ఒక్క ముద్ద అని కొసిరి కొసిరి వడ్డించడం.. వాళ్ల ప్రేమను కాదనకుండా పెట్టింది పెట్టినట్లుగా లాగించడం వల్ల మామూలుగా తినేదాని కంటే ఎక్కువగా తినేస్తామని వాళ్లు చెప్తున్నారు. దీంతో ప్రొటీన్స్.. ఇతర పోషకాలు ఎక్కువస్థాయిలో జమ అయ్యి కొవ్వు క్రమంగా పెరిగి..ఊబకాయానికి దారితీస్తుంది. ఈ కారణం వల్లనే కొత్తగా పెండ్లయిన జంటలు ఆర్నెళ్లు తిరుగకముందే లావెక్కుతారని గాస్లోకి చెందిన సౌథర్న్ మెథడిస్ట్ యూనివర్సిటీ పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.

818
Tags

More News

VIRAL NEWS