అరుదైన కళతో..


Thu,December 7, 2017 01:48 AM

ఒక కళను సమాజహితానికి ఉపయోగిస్తేనేదానికి సార్థకత ఉంటుంది. ఆ ప్రయత్నమే చేస్తున్నది ఈ అమ్మాయి.
sneha
భారతీయ భాషలకు గొప్ప చరిత్ర ఉన్నది. ఇప్పుడు వస్తున్న ఎన్నో రచనలు దేవ్‌నాగరి, గుర్ముఖి, గుజరాతి, బెంగాళీ, ఒరియా, తెలుగు, తమిళ్, కన్నడ, మళయాళం, ఉర్దూ, సింధి నేపథ్యం కలిగినవే. ప్రతి భాషకూ అందమైన అక్షరమాల ఉన్నది. బెంగళూరుకు చెందిన యువ ఆర్టిస్టు స్నేహ.. తమిళ అక్షరాలను ఎంచుకొన్నది. అక్షరాల సమ్మిళితంగా అందమైన బొమ్మలను రూపొందించే ఇనైపు ఆర్ట్‌తో ఆకట్టుకొంటున్నది. ఒక ప్రైవేట్ డిజైన్ స్కూల్‌లో ఆర్ట్, డిజైన్ అండ్ టెక్నాలజీలో శిక్షణ పొందిన స్నేహ.. తమిళ సామెతలను, మంచిమాటలను కాన్వాస్‌పై చెక్కుతున్నది. అక్షరాలతోనే బొమ్మలను వేస్తూ, విషయం అందరికీ అవగతమయ్యేలా చేస్తున్నది. సాదృశ్య పద్ధతిలో రూపొందించిన అక్షర రూపంలో తమిళ సామెతల గొప్ప దనాన్ని ఊహాజనిత చిత్రాలతో తెలియపరుస్తున్నది. చిన్ననాటి నుంచి కుటుంబసభ్యుల ప్రోత్సాహంతో ఈ చిత్రకళపై పట్టుసాధించింది స్నేహ.

366
Tags

More News

VIRAL NEWS