జీవతి.. సేంద్రీయ ఆహారం అదుర్స్


Thu,December 7, 2017 01:43 AM

మీరు సేంద్రీయ పంటల గురించి వినే ఉంటారు. మరి వంటల గురించి విన్నారా? తిన్నారా? ఇప్పుడు మనం తినే తిండిలో ఎన్నో రసాయనాలు. అందుకే ఇన్ని రకాల రోగాలు. అందుకే లెట్స్ గో టు ది రూట్స్ అండ్ బేసిక్స్ అంటూ నగరవాసులకు సరికొత్త సేంద్రీయ ఆహారం రుచి చూపిస్తున్నది జీవతి. ఈ మధ్య కొత్తగా మొదలవుతున్న ప్రతి రెస్టారెంట్ ఏదో ఒక థీమ్‌తో వస్తున్నది. కొత్తదనంతో, కొత్త రుచులతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఇదే దారిలో వందశాతం ఆర్గానిక్ ఫుడ్ కాన్సెప్ట్‌తో వచ్చింది జీవతి రెస్ట్రో. ఇది హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని పెద్దమ్మ గుడికి దగ్గరలో ఉన్నది.
Hotels
రసాయన పంటలు మన ఆహారాన్ని, ఆరోగ్యాన్ని తీవ్రంగా మార్చేశాయి. మనం ఇప్పుడు తింటున్నవన్నీ అవే. తింటే ఆకలి తీరుతుందేమోగానీ ఆ తిండివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అంతకన్నా ఎక్కువగా వస్తున్నాయి. వీటి నుంచి కొంతయినా ఉపశమనం కలిగించేందుకే జీవతి సేంద్రీయ ఆహారాన్ని పరిచయం చేస్తున్నది. జీవతి.. నగరంలోని మొదటి సర్టిఫైడ్ ఆర్గానిక్ రెస్టారెంట్. 114 మంది కూర్చుని తినడానికి ఓపెన్ డైనింగ్ ఉన్నది. 16 మంది కూర్చోవడానికి ప్రైవేట్ డైనింగ్ ప్లేస్ కూడా ఉన్నది. ఇక్కడ రాగి గ్లాసులు, రాగి చెంబులు, రాగి గిన్నెలతో సంప్రదాయబద్ధమైన వాతావరణం కనిపిస్తుంటుంది. ఫ్యామిలీతో కలిసి వెళ్లి సరదాగా తినేందుకు అనువుగా ఉంది జీవతి రెస్ట్రో. ఇది వందశాతం ఆర్గానిక్ రెస్టారెంట్. సేంద్రీయ వ్యవసాయం చేస్తున్న రైతుల దగ్గరి నుంచి కావాల్సిన వస్తువులను దిగుమతి చేసుకుంటున్నారు. దేశంలోని ఎనిమిది రాష్ర్టాల నుంచి ఈ ఆర్గానిక్ ఉత్పత్తులను తీసుకుంటున్నారు. దేశీ ఆవు పాలతో తయారు చేసే పాల పదార్థాలు ఇక్కడి ప్రత్యేకం.

వంటల్లో దొడ్డు ఉప్పు (రాక్‌సాల్ట్) వాడుతున్నారు. మరో ప్రత్యేకత ఏంటంటే.. ఏ రెస్టారెంట్‌లోనైనా కిచెన్‌లో వెళ్లడానికి అందరికీ అనుమతి ఉండదు. కానీ జీవతిలో ఓపెన్ కిచెన్ ఉన్నది. కిచెన్‌లో వాడే వస్తువులు కానీ పరిశుభ్రత కానీ నేరుగా కస్టమర్ వెళ్లి చూడొచ్చు. నూనె కూడా ఫిల్టర్ చేసింది, కెమికల్స్ కలిపింది కాకుండా చక్కటి ఆయిల్ వాడుతారు. వేపుళ్లకు వాడిన నూనె ఒకేసారి వాడి తర్వాత పడేస్తారు. చేపల నుంచి మాంసం దాక, పప్పుల నుంచి కారం పొడి వరకు ప్రతిదీ సేంద్రీయంగా పండించినవే తీసుకొచ్చి వంటల్లో వాడుతున్నారు. ఆర్గానిక్ వెజ్, ఆర్గానిక్ నాన్‌వెజ్ థాలిలు ఇక్కడ మరో ప్రత్యేకత. ఆర్గానిక్ బఫె కూడా ఉన్నది. సేంద్రీయ ఆహారం ఆరోగ్యవంతమైనది, రుచికరంగానూ ఉంటుంది. బ్లాక్ చికెన్ గురించి విన్నారా? ఇక్కడ బ్లాక్ చికెన్ ప్రత్యేకం.ఈ మాంసాన్ని మధ్యప్రదేశ్ నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. బ్లాక్ చికెన్‌తో చేసిన రెసిపీలు ప్లేట్‌కి రూ. 1200 గా నిర్ణయించారు. దీంతో పాటు రోటీ, కానీ రైస్ కానీ కాంబోగా ఇస్తున్నారు. జీవతి రెస్టారెంట్‌లో ఆర్గానిక్ స్టోర్ కూడా ఉన్నది. ఇందులో మీకు కావాల్సిన ఆర్గానిక్ ఉత్పత్తులు కొనుక్కుని వెళ్లొచ్చు.
Hotels1

510
Tags

More News

VIRAL NEWS