యాక్నేని అడ్డుకునే ఆహారం!


Thu,December 7, 2017 01:41 AM

యుక్త వయసు నుంచి పెద్దవాళ్ల వరకు వచ్చే సమస్య యాక్నే. దీన్ని తగ్గించాలంటే ఎన్ని రకాల ఫేస్ ప్యాక్‌లు వేసినా, ఏ ట్రీట్‌మెంట్ చేయించుకున్నా అప్పటి వరకే పనిచేస్తాయి. అలా కాకుండా మన ఆహారంలో కొన్ని మార్పులు చేయాలి. కొన్నిటిని మన ఆహారంలో చేర్చాలి, కొన్నిటినీ తీసేయాలి. అప్పుడే యాక్నే కంట్రోల్ అవుతుంది. ఏమేం మన డైట్‌లో ఉండాలో చూసి లైఫ్‌ైస్టెల్‌లో మార్పులు తెచ్చుకోండి.
acne

ఇవి వద్దు!

చక్కెర ఉత్పత్తులు : డైట్‌లో చక్కెర శాతం ఎక్కువ లేకుండా ఉండాలి. దీనివల్ల ైగ్లెసమిక్ పెరిగి అది ఆక్నేకి దారి తీస్తుంది. అందుకే చాక్లెట్లు, ఇతర చక్కెర ఉత్పత్తులకు దూరంగా ఉండాలి.

తెల్లని ఫుడ్స్ : మీరు సీరియస్‌గా ఆక్నేకి అడ్డుకట్ట వేయాలనుకుంటున్నారా? అయితే తెల్లని ఆహారాలను అంటే.. వైట్ బ్రెడ్, తెల్ల పిండి, ఆలుగడ్డ, ఫ్రెంచ్ ఫ్రైస్‌లాంటివన్నమాట. ఇవి కూడా రక్తంలోని చక్కెర శాతాన్ని పెంచుతున్నాయి.

కెఫైన్ : బ్లాక్ టీ ఎక్కువ తాగడం కూడా శరీరానికే కాదు చర్మానికీ మంచిది కాదు. చాక్లెట్, సోడా, కాఫీ, ఎనర్జీ డ్రింక్స్, పెయిన్ కిల్లర్స్ కూడా మనలోని అడ్రినల్ ప్రేరేపితం చేసి ఒత్తిడి హార్మోన్‌లను విడుదల చేస్తాయి. అలాగే కెఫైన్ మన నిద్రను భంగం చేస్తుంది.

పాల ఉత్పత్తులు : కాస్త వెనక్కి వెళితే 1800 సంవత్సరంలోనే పాల ఉత్పత్తులకి, ఆక్నేకి సంబంధం ఉందని తేల్చడం జరిగింది. డైరీ ఉత్పత్తులు అధిక ఇన్సులిన్‌ని విడుదల చేస్తాయి. దాంతో ఒంట్లో హార్మోన్ల స్థాయిలు పెరిగి ఒత్తిడి కలిగి ఆక్నే సమస్య మరింత ఎక్కువవుతుంది.

ఇవి ఓకే..

గ్రీన్ టీ: ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి. అవి ఒత్తిడిని తగ్గించేస్తాయి. కాబట్టి రోజుకో కప్పు గ్రీన్ టీ తాగండి.

నట్స్ : వీటిలో కూడా యాంటక్సిడెంట్స్ పుష్కలంగా లభిస్తాయి. వాటితో పాటు సెలినీయం ఆక్నేని తగ్గించేందుకు తోడ్పడుతుంది. బాదం, బ్రెజిల్ నట్స్‌లో విటమిన్ ఈ, ఎ ఉంటాయి.

ఒమేగా 3 : మీరు స్కిన్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళితే కచ్చితంగా ఒమేగా 3కి చెందిన క్యాప్సుల్స్ ఇస్తారు. కాబట్టి అవి ఎక్కువగా ఉండే ఆహారాలను మన డైట్‌లో చేర్చుకోవాలి. అంటే వారంలో ఒకసారైనా చేపలను కచ్చితంగా తినాలన్నమాట.

పచ్చ కూరగాయలు : పసుపు పచ్చ, ఆకుపచ్చ రంగులున్న అన్నీ మనకు మేలే చేస్తాయి. అవి కాకుండా నారింజ, క్యారెట్, టమాటాలు కూడా మన ఆహారంలో తప్పకుండా ఉండాలి. ఆకుకూరలు, కోడిగుడ్లలో విటమిన్ ఈ ఎక్కువగా ఉంటుంది. ఇవి కాకుండా ఆలివ్ ఆయిల్‌ని వంటనూనెగా వాడితే మంచి ఫలితం ఉంటుంది.
Sanaa

467
Tags

More News

VIRAL NEWS