ఓహో.. ఓట్స్!


Thu,October 12, 2017 01:58 AM

ఊబకాయం తగ్గాలంటే ఓట్స్ గొప్ప ఆహారం.. అయితే బరువు తగ్గాలనే ప్రయత్నం చేస్తున్న వాళ్లే కాదు.. ఇప్పుడు అందరూ ఓట్స్‌కు దాసోహం అంటున్నారు.. శరీరంలో ఉండే అనేక రుగ్మతలకు స్వస్థత చేకూర్చే ఓట్స్.. వంటింట్లో సాధారణ దినుసుగా మారిపోయింది.. అందుకే ఓట్స్‌తో చేసిన వంటకాలను వండి వార్చాం.. ఘుమఘుమలాడే ఓట్స్ వంటకాలను ఓహో అంటూ ఆస్వాదించండి..
vanta

కావాల్సినవి :

ఓట్స్ : ఒక కప్పు, మైదా : అర కప్పు, రవ్వ : అర కప్పు, బేకింగ్ పౌడర్ : పావు టీస్పూన్, చక్కెర : ఒక కప్పు, మజ్జిగ : ఒక కప్పు, యాలకుల పొడి : అర టీస్పూన్, బటర్ : 2 టీస్పూన్స్, ఉప్పు : తగినంత

తయారీ :

PAN-CAKE
స్టెప్ 1 : ఓట్స్‌ని పొడి చేసి ఒక గిన్నెలో వేసుకోవాలి. అందులో మైదా, రవ్వ, బేకింగ్ పౌడర్ వేయాలి.
స్టెప్ 2 : దీంట్లోనే చక్కెర, కొద్దిగా ఉప్పు వేసి మజ్జిగ పోయాలి. అయితే కలుపుతున్నప్పుడు ఉండలు కట్టకుండా జాగ్రత్త పడాలి.
స్టెప్ 3 : దోశ పిండిలా కలుపుకున్న దీంట్లో యాలకుల పొడి వేసి కాసేపు పక్కన పెట్టాలి.
స్టెప్ 4 : ఇప్పుడు పెనం పెట్టి బటర్ రాసి ఊతప్పంలా ఈ మిశ్రమాన్ని వేయాలి. రెండు వైపులా రంగు మారేవరకు కాల్చుకోవాలి. దీన్ని తేనెతో కలిపి లాగిస్తే బాగుంటుంది.

కావాల్సినవి :

ఓట్స్ : 1 1/2 కప్పులు, ఆలుగడ్డ ముక్కలు : ఒక కప్పు, పచ్చిమిరపకాయలు : 4, గరం మసాలా : అర టీస్పూన్, ఆమ్‌చూర్ : అర టీస్పూన్, కొత్తిమీర : చిన్న కట్ట, కోడిగుడ్లు : 2, బ్రెడ్ పొడి : అర కప్పు, నూనె, ఉప్పు : తగినంత

తయారీ :

ALOO-TIKKIS
స్టెప్ 1 : ఆలుగడ్డలను ఉడికించి మెత్తగా చేసుకోవాలి. దీంట్లో ఓట్స్, పచ్చిమిర్చి, గరం మసాలా, ఉప్పు వేసి బాగా కలుపాలి.
స్టెప్ 2 : ఓట్స్ మిశ్రమాన్ని చిన్న ఉండలుగా చేసి పెట్టుకోవాలి. మరో గిన్నెలో కోడిగుడ్లను వేసి గిలక్కొట్టాలి.
స్టెప్ 3 : ఇప్పుడు ఉండలను కాస్త ఒత్తి వాటిని కోడిగుడ్డు మిశ్రమంలో, ఆ పై బ్రెడ్ పొడిలో వేసి దొర్లించాలి.
స్టెప్ 4 : ఆ తర్వాత కడాయిలో కొద్దిగా నూనె వేసి ఒక్కో టిక్కీని రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. దీన్ని పుదీనా చట్నీ లేదా టమాటా కెచప్‌తో తినొచ్చు.

కావాల్సినవి :

ఓట్స్ : ఒక కప్పు, బియ్యం పిండి : ఒక టేబుల్‌స్పూన్, శనగపిండి : 1 1/2 టేబుల్‌స్పూన్స్, జీలకర్ర : అర టీస్పూన్,
పచ్చిమిరపకాయలు : 2,
కరివేపాకు : రెండు రెమ్మలు, కొత్తిమీర : చిన్న కట్ట, ఉల్లిగడ్డ ముక్కలు : ఒక కప్పు, పెరుగు : 2 టేబుల్‌స్పూన్స్, ఉప్పు, నూనె : తగినంత

తయారీ :

PAKODI
స్టెప్ 1 : ఒక గిన్నెలో ఓట్స్, బియ్యం పిండి, శనగపిండి, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు వేయాలి.
స్టెప్ 2 : దీంట్లో పెరుగు, కొన్ని నీళ్లు పోసి ఉండలు కట్టకుండా కలుపుకోవాలి.
స్టెప్ 3 : కడాయిలో నూనె పోసుకొని ఈ మిశ్రమాన్ని కొద్దికొద్దిగా నూనెలో వేస్తూ వేయించుకోవాలి.
స్టెప్ 4 : ఈ పకోడిలను వేడివేడిగా తింటే మరింత టేస్టీగా ఉంటాయి.

కావాల్సినవి :

ఓట్స్ : ఒక కప్పు, పల్లీలు : అర కప్పు, నువ్వులు : అర కప్పు, ఖర్జూరా ముక్కలు : అర కప్పు, బెల్లం తురుము : అర కప్పు, యాలకుల పొడి : చిటికెడు

తయారీ :

Oats-Ladoo
స్టెప్ 1 : పల్లీలను, నువ్వులను విడివిడిగా వేయించి పక్కన పెట్టుకోవాలి.
స్టెప్ 2 : అదే కడాయిలో ఓట్స్‌ని కూడా దోరగా వేయించాలి. ఇవన్నీ చల్లారే వరకు అలాగే ఉంచాలి.
స్టెప్ 3 : ఇప్పుడు అన్ని మిక్సీలో వేయాలి. వీటితో పాటు యాలకుల పొడి, ఖర్జూర ముక్కలు, బెల్లం తురుము వేసి మిక్సీ పట్టాలి.
స్టెప్ 4 : ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. అంతే.. రుచికరమైన ఓట్స్ లడ్డూలు రెడీ!

కావాల్సినవి :

ఓట్స్ : 30 గ్రా., మైదా : 100 గ్రా., బటర్ : 60 గ్రా., చక్కెర పొడి : 50 గ్రా., వెనీలా ఎసెన్స్ : అర టీస్పూన్, బేకింగ్ సోడా : చిటికెడు, జీడిపప్పు : 10గ్రా., కిస్‌మిస్ : 5 గ్రా.,

తయారీ :

COOKIES
స్టెప్ 1 : ఓట్స్‌ని కాసేపు నానబెట్టాలి. ఒక గిన్నెలో బటర్, చక్కెర పొడి, వెనీలా ఎసెన్స్ వేసి బాగా కలుపాలి.
స్టెప్ 2 : మరో గిన్నెలో మైదా, నానబెట్టిన ఓట్స్, జీడిపప్పు, కిస్‌మిస్, బేకింగ్‌సోడా వేయాలి. దీంట్లో ముందు కలిపిన వెనీలా మిశ్రమం కలుపుకోవాలి.
స్టెప్ 3 : ఈ మిశ్రమాన్ని చిన్న ఉండలుగా చేసుకోవాలి. పై నుంచి మళ్లీ కొన్ని ఓట్స్ చల్లుకోవాలి. అన్నింటినీ మంచి షేప్స్‌గా కట్ చేసి బేకింగ్ ట్రేలో పెట్టుకోవాలి.
స్టెప్ 4 : ఓవెన్‌లో పెట్టి 180 డిగ్రీల వద్ద పది నిమిషాల పాటు బేక్ చేయాలి. తియ్యటి ఓట్స్ కుకీస్ నోరూరిస్తూ మీ ముందుంటాయి.
Thuma

784
Tags

More News

VIRAL NEWS

Featured Articles