భారమంతా భార్యలదే!


Thu,October 12, 2017 01:44 AM

ఈ కాలం మహిళలు అన్ని రకాల ఉద్యోగాలూ చేస్తున్నారు. ఫలితంగా భర్తలు కూడా ఇల్లాలి పనిలో పాలుపంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ.. పేరుకు పని చేస్తున్నట్లు కనిపిస్తారే కానీ.. భార్య చేసినదాంట్లో పది శాతం కూడా చేయరని చెప్తున్నారు పరిశోధకులు. ఎలా? ఎందుకు?
Working-Wives
పొద్దునలేచింది మొదలు.. రాత్రి పడుకునేదాక తీరిక లేకుండా ఎంతసేపని పనిచేస్తారు? అందుకే మేమూ ఆసరా అవుతాం. ఇల్లాలికి పని భారం తగ్గిస్తాం అనేవాళ్లు చాలామందే ఉన్నారు. కానీ ప్రాక్టికల్‌గా చూస్తే పనిలో భార్యలతో పోటీపడలేరని ఓహియో స్టేట్ యూనివర్సిటీ పరిశోధకులు చెప్తున్నారు. పిల్లలు- తల్లిదండ్రుల పని అనే అంశంపై తాజాగా వాళ్లు అధ్యయనం చేశారు. ఇందులో భాగంగా 52 మంది దంపతులను పరిశీలించారు. పిల్లల్ని చూసుకోవడం.. వంటపని.. ఇంటి మెయింటనెన్స్ విషయాలు భర్తలకన్నా భార్యలే ఎక్కువ చూసుకొంటున్నారట. 46 శాతం మంది పురుషులకు అసలు పేరెంటింగ్ అంటే ఏంటో తెలియదట. వారు ఎంతసేపూ రిలాక్స్ అవడానికే ప్రయత్నిస్తారట. పైకిమాత్రం ఏదో చేస్తున్నట్లు.. భార్యకు పనిలో సహకరిస్తున్నట్లు నటిస్తారని సర్వే ద్వారా తెలుస్తున్నది. 16 శాతం మంది మగవారు మాత్రమే పిల్లలను చూసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారట. 35 శాతం మంది భర్తలు పని అంటే తప్పించుకుంటారట. పని అంటే ముఖం చాటేసే భార్యలు కేవలం 19 శాతమే అని పరిశోధకులు చెప్తున్నారు.

587
Tags

More News

VIRAL NEWS