బాల్య వివాహాన్ని ఎదిరించి..


Thu,October 12, 2017 01:43 AM

పన్నెండేళ్లకే పెండ్లి చేశారు. చదువుకుంటానంటే కట్టుబాట్లతో కట్టిపడేశారు. అత్తారింటికి పంపొద్దని వేడుకున్నా.. కన్న హృదయాలు కరుగలేదు. మరి ఆ యువతికి విముక్తి ఎలా కలిగిందంటే..?
Jodhpur-Girl
జోధ్‌పూర్‌కు చెందిన సుశీలకు చదువంటే చాలా ఇష్టం. బాగా చదువుకుని పెద్ద పోలీస్ ఆఫీసర్ కావాలని కలలు కనేది. దురదృష్టవశాత్తు తనకు తల్లిదండ్రులే శత్రువులయ్యారు. 12 ఏండ్లు రాగానే నరేష్ అనే వ్యక్తితో పెండ్లి చేశారు. అత్తారింటికి పంపొద్దని వేడుకున్నా.. ఆ కఠిన హృదయాలు కరుగలేదు. దీంతో ఓ అర్ధరాత్రి ఇంటి నుంచి పారిపోయింది. ఓ పునరావాస కేంద్రంలో చేరింది. అక్కడ కీర్తిభారతి అనే సైకాలజిస్టుతో కలిసి.. తన పెండ్లిని రద్దు చేయాలని కోర్టులో పోరాడింది. ఇందుకు ఫేస్‌బుక్‌ను వేదికగా చేసుకుని తగిన సాక్ష్యాధారాలు సంపాదించి కోర్టుకు సమర్పించి.. తన బాల్య వివాహాన్ని రద్దు చేయించుకున్నది. ప్రస్తుతం సుశీలకు 18 ఏండ్లు. పునరావాస కేంద్రంలో ఉంటూనే తన లక్ష్యం చేరుకుంటానంటున్నది.

513
Tags

More News

VIRAL NEWS

Featured Articles