తాటి పటాకుల వనితలు!


Thu,October 12, 2017 01:42 AM

మనం చూసే పటాకుల్లా కాకుండా ఒడిశాలో తాటాకుల పటాకులు చేస్తారు. వాటిని తాళ పటాకా అంటారు. దీపావళి వస్తే కొందరికి వ్యాపార సంబురం. కొందరికి లాభాల సంబురం. కానీ వీళ్లకు పని సంబురం.
Salepur-Women
ఒడిషాలోని సిసువా పట్టణం సలేపూర్ బ్లాక్‌కు చెందిన మహిళల జీవితమిది. ఇక్కడ దాదాపు 100 కుటుంబాలు తాటాకు పటాకుల తయారీపై ఆధారపడి ఉన్నాయి. సంవత్సరం పొడువునా వేరే కూలీపని చేసుకొని దసరాకు ముందు నుంచి పటాకుల తయారీ ప్రారంభిస్తారు. ఇక్కడి వ్యాపారవేత్తలకు ఇదొక మంచి బిజినెస్‌గా.. మహిళలకు ఆదాయ వనరుగా ఉన్నది. తమ కాళ్లపై తాము నిలబడి గ్రూపులుగా ఏర్పడి ఆర్థిక స్వావలంబన సాధించేందుకు ఈ పని వాళ్లకు చాలా ఉపయోగపడుతున్నది. సున్నితమైన.. చేయడానికి కష్టమైన ఈ పనిని వాళ్లు చాలా నేర్పుగా.. కళాత్మకంగా చేస్తూ అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నారు. అందుకే సలేపూర్ తాటి పటాకులకు చాలా గిరాకీ.. డిమాండ్ ఉంటుంది. పైగా ఇవి వేర్వేరు ప్రాంతాలకు సరఫరా అవుతుంటాయి. పటాకులను కళాత్మకంగా చేస్తూ.. ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు వేస్తున్నారు ఈ వనితలు.

305
Tags

More News

VIRAL NEWS