మితంగా ఉండాలంతే..


Thu,October 12, 2017 01:40 AM

ఏడేళ్ల ప్రేమాయణం ఏడడుగులతో ముగిసింది. అక్కినేని ఇంటి కోడలుగా అడుగు పెట్టింది సమంతా. చేతినిండా సినిమాలతో కూడా బిజీగా ఉన్న ఈ నటి ఆహారనియమాలు ఏమిటో మీకు తెలుసా?
Samanthaa
నాకు ఉపావాసాలు చేయడమన్నా, డైటింగులన్నా అస్సలు ఇష్టం ఉండదు. అన్ని రకాల వంటకాలను తింటాను. కాకపోతే అవి మితంగా ఉండాలంతే! శరీరంలో క్యాలరీలు చేరుతాయని నోరు కట్టేసుకుంటే ఏదీ తినలేం. ఒకవేళ తిన్నా దానికి తగ్గట్లుగా వ్యాయామం చేస్తే సరిపోతుంది. అలాగే నా ఫుడ్‌లో ప్రొటీన్ ఎక్కువ ఉండేలా చూసుకుంటా. నట్స్, బెర్రీస్, కూరగాయలతో, సలాడ్లు, పండ్లు, లీన్ మీట్‌ని ఇష్టంగా తింటా. ఇవికాకుండా సాంబరన్నం అంటే ప్రాణం. అలాగే తమిళ వంటకాలైన దోశ, వడ, ఇడ్లీ, పొంగల్ పేర్లు చెబితే నోట్లో నీళ్లూరుతాయి. ఇవి కనిపిస్తే తినకుండా ఒక నిమిషం ఆగలేను. చికెన్, చేపలు, కారంగా ఉండే పచ్చళ్లు, స్వీట్ పొంగల్, ఫిల్టర్ వేసిన బ్లాక్ కాఫీ కూడా తాగుతా. మంచినీళ్లు, కొబ్బరి నీళ్లు, జ్యూసులు తరుచుగా తీసుకోవడం వల్ల శరీరం డీహైడ్రేట్ కాకుండా ఉంటుంది.

423
Tags

More News

VIRAL NEWS