అదే పిల్లలకు నేర్పుతున్నా!


Tue,June 12, 2018 10:57 PM

లింగ భేదాలు అస్సలే ఉండకూడదు. మగవాళ్ల కంటే ఆడవాళ్లు ఎందులోనూ తక్కువకాదు. వాళ్లు సైకిల్, బైక్, కారు, విమానాలు నడిపితే ఆడవాళ్లు ఎందుకు నడపకూడదు. అందరూ సమానమే! అదే నా పిల్లలకు నేర్పుతున్నా అంటున్నదీ మహిళ.
Bad-Women-Lucky
ఈ మహిళ పేరు లక్కీ. ఈమె బైక్ నడిపితే తమ గ్రామంలోని వారంతా విచిత్రంగా చూసేవారట. కొద్దిరోజులకు గ్రామస్తులంతా కలిసి లక్కీ బ్యాడ్ ఉమెన్ అని పేరు పెట్టారు. ఎందుకంటే ఒక మహిళ బైక్ నడుపడం తప్పు అనేది వారి అభిప్రాయం. అయినా అటువంటి మాటలను పట్టించుకోకుండా నిరభ్యంతరంగా బైక్ నడుపుతూ, తన భర్తను వెనుక ఎక్కించుకొని దర్జాగా ఆఫీస్‌కు వెళ్తున్నది లక్కీ. ఓ అంతర్జాతీయ ఎన్జీఓలో ఉద్యోగం చేస్తున్న లక్కీ.. మగవారితో సమానంగా ఆడవారు అన్ని పనులూ చేయాలని పిలుపునిస్తున్నది. చిన్నప్పుడు తల్లి చెప్పిన మాటలనే తన కూతుళ్లకూ చెబుతున్నది. లింగభేదాలు పట్టించుకుంటే ఆడపిల్ల వంటింటికే పరిమితమవుతుందని, ఆడపిల్లలు మగవారితో సమానంగా పనిచేయాలని అంటున్నది. మొదట్లో ఆమెను బ్యాడ్ ఉమెన్ అని సంబోధించిన గ్రామస్తులే.. తమ పిల్లలను కూడా విద్యావంతులుగా తీర్చిదిద్దుతున్న లక్కీని చూసి గర్వపడుతున్నారు. తన పిల్లలతో పాటుగా స్థానికుల పిల్లలకు బైక్ తోలడం నేర్పిస్తున్నది లక్కీ. సమాజంలో అందరికీ సమాన హక్కులు ఉంటాయని, అందరూ సమానమే అని అంటున్నది.

479
Tags

More News

VIRAL NEWS