కురులకు కరివేపాకు!


Tue,June 12, 2018 10:57 PM

వంటలో కరివేపాకు లేకపోతే ఏదో వెలితి అనిపిస్తుంది. ఇది వంటలోకే కాదు ఆరోగ్యాన్ని, అందాన్ని, కురులను కాపాడుతుంది. ఎన్నో పోషక విలువలున్న కరివేపాకు కురులకు ఎంతో మేలు చేస్తుంది.
hair-care
-గుప్పెడు కరివేపాకులను మూడు చెంచాల కొబ్బరి నూనెలో నల్లగా మాడే వరకూ వేయించాలి. చల్లారిన తర్వాత నూనెను వడగట్టి, తలకు రాసుకోవాలి. మునివేళ్లతో కుదుళ్లకు పట్టేలా మర్దనా చేయాలి. గంట తర్వాత షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా వారానికి మూడుసార్లు ప్రయత్నించొచ్చు.
-కరివేపాకులో అధికంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మాడును తేమగా ఉంచేందుకు సహాయపడుతాయి. దీంతో మృత కేశాలు ఏర్పడవు.
-కరివేపాకులోని అమైనో ఆమ్లాలు జుట్టును దృఢంగా చేసి, తెగిపోకుండా ఉంచుతాయి.
-కరివేపాకులో ఉండే ప్రోటీన్లు, మీటా కెరోటీన్ జుట్టు రాలడాన్ని అరికడుతాయి.
-కరివేపాకులో ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, పీచుపదార్థం మాత్రమే కాకుండా, ఐరన్, క్యాల్షియం, విటమిన్ సి, ఖనిజాలు శిరోజాలను దృఢపరుస్తాయి.

882
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles