సహేళి.. చిత్రాలకేళి!


Tue,June 12, 2018 10:56 PM

తెల్లటి క్యాన్వస్ మీద నాలుగైదు రంగులు కలిపి అద్భుత ప్రపంచాన్ని, విస్మయ పరిచే కళాఖండాన్ని సృష్టించవచ్చు. కానీ ఆ విస్మయం, ఆశ్యర్యంతో పాటే కాసింత ఆదర్శం, సందేశం కూడా ఇస్తే.. అవి సహేళి వేసిన బొమ్మలవుతాయి.
saheli
సహేళీ ఖస్తగిర్. ఓ ఔత్సాహిక ఆర్టిస్టు. కొందరిలా తాను కూడా నాలుగైదు బొమ్మలు వేసి ఏదో సాధించేసినట్టు గొప్పలు పోవాలని ఆలోచించలేదు. తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు, మహిళా లోకానికి వన్నె తెచ్చిన మహిళామూర్తుల ద్వారా తానో సందేశమివ్వాలనుకున్నది. అందుకే.. ఆలోచించి 26మంది రచయిత్రుల బొమ్మలను ఆల్ఫాబెటికల్ ఆర్డర్‌లో అందంగా చిత్రించింది. దానికి #writlywomen అనే ట్యాగ్‌లైన్‌తో సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అంతర్జాతీయస్థాయిలో సాహిత్యంలో కీర్తిని సాధించిన గొప్ప గొప్ప కవయిత్రులు, రచయిత్రుల చిత్రపటాలు సరికొత్త కోణంలో వేసింది. చేయి తిరిగిన చిత్రకారులతో సైతం ఔరా అనిపించుకుంది. ఆ 26 బొమ్మలను ఒకచోట చేర్చి 26portraits.wordpress.com పేరుతో ఒక వెబ్‌సైట్ ప్రారంభించింది. అందులో ఒక్కొక్కరి చిత్రం కింద వారు సాధించిన విజయాలు, వారి కలం నుంచి జాలువారిన కావ్యాలు, రచనల వివరాలు, వారి బాల్యస్మృతులను తెలియపరుస్తూ పోస్ట్ చేసింది. వారి జీవితాల్లో జరిగిన సంఘటనలను, తన జీవితంలో జరిగిన సంఘటనలతో పోలుస్తూ పలు కామెంట్లు రాసింది. వెబ్‌సైట్‌లో సహేళీ ఆర్ట్, వారి గురించి ఆమె రాసిన విధానం చూసి అందరూ శభాష్ అంటున్నారు.

587
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles