పారిస్ లక్ష్మి.. ఫిదా అయింది!


Wed,March 14, 2018 01:38 AM

మన దేశ సంస్కృతీ సంప్రదాయాల్లో మనకు తెలియని అద్భుతాలెన్నో ఉన్నాయి. ఇక్కడ కనిపించే విభిన్న సంస్కృతికి విదేశీయులు ఫిదా అవుతున్నారు. ఇక పారిస్ లక్ష్మి ఏకంగా మనదేశ కోడలైపోయింది.
MyriamSophia-Lakshmi
నిజమే.. మన సంస్కృతిలో ఏదో మహాజగత్తు ఉన్నది. ఇక్కడి సంప్రదాయాలు తెలుసుకున్న విదేశీయులు ఎవరైనా మరోసారి ఇండియాకు వెళ్లాలి అంటుంటారు. ఇక ఫ్రాన్స్‌కు చెందిన మిరియాం సోఫియా లక్ష్మి క్వినియోకు మన దేశమంటే ఎంతో ఇష్టం. ఎంతంటే..? మనదేశానికి చెందిన వ్యక్తిని పెండ్లి చేసుకొని.. ఇక్కడే స్థిరపడేంత. ఇక్కడి అలవాట్లు, ఆచారాలు, సంప్రదాయాలు, కట్టుబాట్లు, విభిన్న నృత్యాలు, భిన్న జాతులను చూసి ఇక్కడే శాశ్వతంగా ఉండాలని చిన్నప్పుడే నిర్ణయించుకున్నది మిరియాం. చిన్నప్పుడు ఏసు ప్రభువు కథలతో పాటు.. ఇండియాలోని దేవుళ్లు, వాళ్ల విశిష్టత, చరిత్రను తల్లిద్వారా తెలుసుకున్నది. అంతే ఆరోయేట నుంచే ఇండియాకు కుటుంబంతో వస్తూ.. ఇక్కడి భరతనాట్యం నేర్చుకునేది. ఇలా ప్రతియేటా తప్పకుండా ఇండియాలోని ప్రముఖ ప్రాంతాలు సందర్శించేది. అలా కేరళకు చెందిన కథక్ కళాకారుడు పల్లిపురం సునిల్‌ను పెండ్లి చేసుకున్నది. ఇద్దరూ కళాశక్తి అనే డాన్స్ స్కూల్ ప్రారంభించి.. పలువురికి శిక్షణ ఇస్తున్నారు. సంస్కృతిపైన మక్కువతో దక్షిణాదిలోని దాదాపు పది సినిమాల్లో విదేశీ నృత్యకారిణిగా నటించింది లక్ష్మి. అలా మన సంస్కృతిలో తాను భాగమైంది.

763
Tags

More News

VIRAL NEWS

Featured Articles