పండ్లరసాలు.. గుజ్జుతో..


Wed,March 14, 2018 01:37 AM

ముఖం కాంతివంతంగా మారడానికి, చర్మ సౌందర్యం మెగురుపడేందుకు పండ్ల రసాలు, గుజ్జు ఎంత ఉపయోగపడుతాయో తెలుసుకొని.. మీరూ ఓ సారి ప్రయత్నించండి.
Tips
-బాగా పండిన అరటి పండుకు అలివ్ ఆయిల్, రోజ్‌వాటర్, కోకో వాటర్ కలిపి ఫేస్‌ప్యాక్ చేసుకోవాలి. గోరు వెచ్చని నీరు/పాలతో శుభ్రం చేసుకుంటే మెరిసే చర్మం మీ సొంతం.
-పుచ్చకాయను ముక్కలుగా కట్ చేసి ముఖం మీద మసాజ్ చేయాలి. తడి ఆరిన తర్వాత మళ్లీ మసాజ్ చేయాలి. ఇలా నాలుగుసార్లు చేస్తే ముఖం కాంతివంతమవుతుంది.
-అరకప్పు స్ట్రాబెర్రీలను పేస్టుగా చేసి, అందులో సోర్ క్రీమ్‌ను మిక్స్ చేసి ముఖానికి రాయాలి. 10-15 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగితే మొటిమలు తగ్గుతాయి.
-ఒక కప్పు దానిమ్మ గింజలు పేస్టు చేసుకుని 3/4 కప్పు క్రీమ్ మిక్స్ చేసి, మెడకు ఐప్లె చేయాలి. 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగితే ఆయిల్ స్కిన్ తొలగిపోతుంది.
-పొట్టుతో సహా ఆపిల్ ముక్కలను పేస్టు చేసి, అందులో ఒక స్పూన్ రోజ్ వాటర్ కలిపి, ఆ మిశ్రమాన్ని ముఖానికి రాయాలి. తర్వాత గోరు వెచ్చని నీటితో శుభ్రం చేయాలి.
-కర్బూజలో విటమిన్ ఏ, సి అధికంగా ఉండే కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది.
-నల్లటి వలయాలు, చారలు, జిడ్డు ముఖాన్ని తప్పించుకోవడం కోసం ద్రాక్షరసం అద్భుతంగా పనిచేస్తుంది.

613
Tags

More News

VIRAL NEWS

Featured Articles