ఆకుపచ్చ బహుమతి


Tue,November 14, 2017 11:45 PM

ఈ ప్రకృతిలో పచ్చని చెట్టు.. మానవాళికి సృష్టి అందించిన గొప్ప బహుమతి.. ఆహ్లాదపరిచే ఈ పచ్చదనాన్ని.. మనసుకు నచ్చిన వాళ్లకు గిఫ్ట్‌గా ఇస్తే ఎలా ఉంటుంది?
ఆలోచన చక్కగా ఉంది కదా! అలా ఆలోచించేవాళ్ల కోసమే అరుదైన మొక్కలను.. వినూత్న రీతుల్లో అలంకరించి సిద్ధం చేస్తున్నది గుంజన్. వృత్తి వ్యాపారమే అయినా పచ్చదనంపై మమకారంతో.. గిఫ్ట్ ఏ ప్లాంట్ అనే కాన్సెప్ట్‌తో ముందుకు సాగుతున్నది.ఏదైనా ఫంక్షన్‌కి వెళ్తున్నారా? ఏం గిఫ్ట్ తీసుకెళ్తున్నారు? బంగారం, బట్టలు వగైరా పట్టుకెళ్తున్నారా? వాటికి బదులు పచ్చని మొక్కను బహుమతిగా ఇస్తే ఎంత బావుంటుందో ఒక్కసారి ఆలోచించండి. ఈ ఐడియా కొత్తదేం కాదు.. కానీ పచ్చని మొక్కల్ని మరింత పసందుగా అకేషన్‌కు తగ్గట్టుగా అలంకరిస్తే అది నిజంగా స్పెషలే కదా. అదెలాగంటారా? ఇదిగో ఇది మొత్తం చదువండి మీకే తెలుస్తుంది.
gunjan
ఒకవైపు చూస్తే పచ్చని మొక్కలతో నర్సరీని తలపిస్తుంది.. మరోవైపు ఒక ఆర్ట్ ఎగ్జిబిషన్‌లా అనిపిస్తుంది. జూబ్లిహిల్స్‌లో ఉన్న పౌదే సే యారీలోకి వెళితే ఇలాంటి అనుభూతి కలుగకుండా ఉండదు. ఇంతకీ అదేమిటంటే.. అందమైన మొక్కల కేంద్రం. మొక్కలంటేనే అందమైనవి, ఆహ్లాదకరమైనవి.. ఇంకేంటి కొత్తగా అందం అనుకోవద్దు. మీ ఇంటిని, మీ ఇంటి పరిసరాలను మరింత అందంగా తీర్చిదిద్దగలిగే అరుదైన మొక్కలు లభిస్తాయక్కడ. అదికూడా.. మూమూలుగా కాదు.. అవన్నీ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో డెకరేట్ చేసినవి.

పచ్చదనమంటే ప్రాణం


రాజస్థాన్‌కు చెందిన చెందిన గుంజన్ డొమింగో వృత్తిరీత్యా వ్యాపారవేత్త. చాలా ఏండ్ల క్రితమే హైదరాబాద్‌లో స్థిరపడిన ఈమెకు పచ్చని మొక్కలంటే ప్రాణం. తన ఇంట్లోనే అందమైన షోకేస్ మొక్కల్ని పెంచుకునేదావిడ. వాటినే అందంగా అకేషన్‌కు తగ్గట్టుగా ముస్తాబు చేసి.. బంధువులు, స్నేహితుల ఇండ్లలో శుభాకార్యాలు జరిగినప్పుడు బహుమతిగా ఇచ్చేది. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఆమె మొక్కలను ముస్తాబు చేయడం అందరికీ నచ్చేది.
Recycling-Plantation1

గిఫ్ట్ ఏ ప్లాంట్..


రకరకాల వస్తువుల్ని బహుమతులుగా ఇచ్చే బదులు.. పచ్చని మొక్కను గిఫ్ట్‌గా ఇచ్చి చూడండంటూ గిఫ్ట్ ఏ ప్లాంట్ అనే కాన్సెప్ట్‌తో ఆమె చేపట్టిన ఈ వ్యాపారానికి మంచి స్పందనే వస్తున్నది. దీని కోసం ఆమె దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి మొక్కలను సేకరిస్తున్నది. నర్సరీలో వాటిని భద్రపరిచి, క్లయింట్స్‌కు నచ్చిన విధంగా డిజైన్ చేసి అందజేస్తున్నది.

ఉపాధి చూపుతూ..


మొక్కల సేకరణ నుంచి వాటిని.. క్లయింట్స్‌కు నచ్చిన విధంగా విభిన్న కాన్సెప్టులతో తయారు చేయడం వరకు పెద్ద ప్రాసెసే ఉంటుందిక్కడ. దానికి సంబంధించి ప్రతి విభాగంలో నిష్ణాతులను నియమించింది గుంజన్. ఉడెన్ ప్లాంటర్స్, మెటల్ ప్లాంటర్స్, టెరీనియమ్స్, టెర్రకోట, పింగాణి, ఐరన్.. ఇలా రకరకాల మెటల్స్, మెటీరియల్స్‌తో తయారైన కుండీల్లో మొక్కలను అలరింకరించి వాటిని, అకేషన్‌కు తగ్గట్టు డెకరేట్ చేసేందుకు ఎక్స్‌పర్ట్స్ ఉంటారిక్కడ. ఆమె దగ్గర ప్రత్యక్షంగా, పరోక్షంగా చాలామంది ఉపాధి పొందుతున్నారు. ఈ మొక్కల్ని డిఫరెంట్ కాన్సెప్ట్‌తో డిజైన్ చేయడానికి ఆర్ట్ డిజైనర్స్, కార్పెంటర్స్‌తో మొక్కల సంరక్షణ చూసేందుకు మరికొందరు ఇక్కడ పనిచేస్తున్నారు.
Recycling-Plantation2

విభిన్నమైన మొక్కలు..


గుంజన్ దగ్గర సుమారు మూడు వందల వెరైటీ మొక్కలు ఉన్నాయి. వాటిలో ఎక్కువగా ఇండోర్ ప్లాంట్సే ఉన్నాయి. ఇంటిలో షోకేస్‌గా పెట్టుకోవడానికి వీటిని ఉపయోగించవచ్చు. పిల్లల కోసం ప్రత్యేకంగా అలంకరించిన మొక్కలు మరీ స్పెషల్. బర్త్‌డే స్పెషల్‌గా వాళ్లకు ఈ మొక్కల్ని గిఫ్ట్‌గా ఇవ్వడం ద్వారా.. పచ్చదనంపై అవగాహన పెంచవచ్చు. అలాగే వెడ్డింగ్ యానివర్సరీస్, రకరకాల ఈవెంట్స్‌కు విభిన్నమైన కాన్సెప్టులతో అలంకరించిన మొక్కలు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. వంటింట్లో పెంచుకునే మొక్కలు కూడా ఉన్నాయిక్కడ. వీటి ధరలు రూ. 250 రూపాయల నుంచి 2500 వరకు ఉన్నాయి.
Recycling-Plantation3

సమ్‌థింగ్ స్పెషల్..


ఇక్కడ క్యాక్టస్ వెరైటీస్, బోన్సాయి వెరీవెరీ స్పెషల్. అందమైన ముండ్ల చెట్లివి. చిన్న చిన్న కుండీల్లో అందంగా ఒదిగిపోయే ఈ మొక్కలు ఇంటి అలంకరణకు భేషూగ్గా పనికొస్తాయి. వీటికి బకెట్లకు బకెట్లు నీళ్లు పోయాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ నీటిని స్ప్రే చేస్తే చాలు. అలాగని ఏపుగా పెరిగిపోయి, ఇళ్లంతా గుబురుగా అయ్యే రకం కూడా కాదు. అందంగా కనిపించేలా.. చాలా నెమ్మదైన ఎదుగుదల ఉంటుంది.
Recycling-Plantation4

పాడైపోయిన బట్టల్ని, వస్తువుల్ని బయట పారేస్తుంటారు చాలామంది. పౌదే సే యారీ లో దానిక్కూడా ఒక కాన్సెప్ట్ ఉంది. ఒక మొక్క జీన్స్ వేసుకుంటే ఎలా ఉంటుంది? ఐడియా బావుందా?? మొక్కను ఉంచి కుండీకి పాత జీన్స్‌ప్యాంట్‌ను తొడిగిస్తే ఆ లుక్కే డిఫరెంటు. సర్వీసు అయిపోయి టైర్లనుకుండీలుగా చేసి, వాటి మధ్యలో అందమైన మొక్కల్ని పెంచితే.. అదీ విభిన్నమే. ఇలా ఒకటేమిటి.. గిఫ్ట్ ఏ ప్లాంట్ పేరిట రకరకాల కాన్సెప్ట్‌లతో పచ్చదనంపై అవగాహన కల్పిస్తున్నది గుంజన్. మరింత సమాచారం కోసం gunjandomingo @yahoo.com ఈమెయిల్‌లో సంప్రదించవచ్చు.

1042
Tags

More News

VIRAL NEWS

Featured Articles