సూపర్ స్పేస్ మిషన్లు


Wed,November 15, 2017 01:42 AM

చందమామ రావే.. జాబిల్లి రావే.. అని దూరం నుంచి గోరుముద్దలు తినిపించే రోజుల నుంచి ైఫ్లెట్ ఏసుకుని ఏకంగా చందమామ మీద డిన్నర్ చేసే స్థాయికి ఎదిగాం. కారు, రైలు, విమానంలో తిరుగుతూ భూమ్మీద ఏమేముందో చూసొచ్చేశాం. ఇప్పుడు జెట్ వేసుకెళ్లి ఏకంగా పక్క గ్రహం మీద ఏముందో చూసొస్తున్నాం. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీతో ఇంట్లో ఉండే సౌరగ్రహం మీద ఏం జరుగుతుందో చెప్పేస్తున్నాం. మరింత అడ్వాన్స్‌డ్‌గా రాబోయే రోజుల్లో అంతరిక్ష రహస్యాలను చేధించేందుకు సూపర్ స్పేస్‌మిషన్లు తయారుచేస్తున్నారు. భవిష్యత్తులో రాబోయే కొన్ని స్పేస్ మిషన్ల విహంగ వీక్షణమిది.
earth
1--james-webb-space

జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్

ఈ స్పేస్ మిషన్ వచ్చే సంవత్సరం అక్టోబర్ నెలలో లాంచ్ చేయనున్నారు. నాసా, ఈఎస్‌ఏ, సీఎస్‌ఏ
లక్ష్యాలు : నాలుగు ఇన్‌ఫ్రారెడ్ పరికరాలతో బిగ్‌బ్యాంగ్ తర్వాత కొత్త గెలాక్సీల కోసం పరిశోధిస్తాయి. గెలాక్సీలు ఎలా పుడుతాయి? వాటి పరిణామ క్రమాన్ని పరిశీలించి, నక్షత్రాల మొదటి దశ నుంచి అంతిమ దశ వరకు రికార్డు చేస్తుంది. గ్రహవ్యవస్థ యొక్క బౌతిక, రసాయన వ్యవస్థను అధ్యయనం చేస్తాయి. అంతేకాదు.. సోలార్ సిస్టమ్ యొక్క జీవితకాలాన్ని కూడా అధ్యయనం చేస్తాయి.
ఏం ఆశిస్తున్నారంటే: జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ నుంచి అంతరిక్షం నుంచి ఇప్పటి వరకు చేధించలేని రహస్యాలను, వాటి తాలూకు ఫొటోలను ఈ మిషన్ ద్వారా సాధించవచ్చునని ఆశిస్తున్నారు. ఇప్పటి వరకు ఉన్న స్పేస్ మిషన్ల కంటే ఈ మిషన్ విశ్వాన్ని ఏడురెట్లు దగ్గరగా చూపించగలదనుకుంటున్నారు. గ్రహశకలాల రేగిన దుమ్ము ధూళి కణాలను కూడా అధ్యయనం చేసి ఆ కణాలలో ఎలాంటి ధాతులువున్నాయో పరిశోధన చేస్తుంది. భూమి వేగంతో సమానంగా సూర్యుడి చుట్టూ తిరుగుతూ అంతరిక్షం నుంచి ఇప్పటి వరకు ఇతర స్పేస్ మిషన్లు చేధించలేని, సాధించలేని రహస్యాలను, వివరాలను అందించగలదని ఆశిస్తున్నారు. 230 డిగ్రీల టెలిస్కోప్ ఈ స్పేస్ మిషన్లో బిగించబడి ఉంది. చేధించాలనుకున్న టార్గెట్‌ను చేరుకోవడంలో ఈ టెలిస్కోప్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
laser-interferometer

లేజర్ ఇంటర్‌ఫేరోమీటర్ స్పేస్ ఆంటెనా

ఈ మిషన్‌ను ఈఎస్‌ఏ వాళ్లు నిర్మిస్తున్నారు. 2034లో ఈ మిషన్ ప్రారంభమయ్యే అవకాశం ఉన్నది.
లక్ష్యాలు : భూమి గురుత్వాకర్షణ తరంగాలను ఆధారంగా చేసుకుని లేజర్ ఇంటర్ ఫేరోమీటర్ స్పేస్ ఆంటెనా (లిసా) పనిచేస్తుంది. భూమిలో గల కృష్ణబిలాలను గురుత్వాకర్షణ శక్తి ఆధారంగా తరంగాలను డిటెక్ట్ చేసి గుర్తిస్తుంది.
ఏం ఆశిస్తున్నారంటే: గురుత్వాకర్షణ తరంగాల గురించి ఐన్‌స్టీన్ చెప్పిన సాధారణ సాపేక్షత సిద్ధాంతం ఆధారంగా పనిచేస్తుంది. ఈ సిద్ధాంతం ఆధారంగా భూమిని గుర్తించడానికి లిగో డిటెక్టర్ ద్వారా వంద సంవత్సరాల సమయం పడుతుంది. కానీ ఈ మిషన్ ద్వారా ఆ సమయాన్ని తగ్గించవచ్చనుకుంటున్నారు. దాదాపు 2.5 మిలియన్ల దూరం నుంచే గురుత్వాకర్షణ తరంగాలను అధ్యయనం గుర్తింస్తుంది. 20 పీకోమీటర్ల (మీటర్‌లో ట్రిలియన్ భాగం) నుంచే మిలియన్ కిలోమీటర్ల దూరానికి సిగ్నల్స్ ఇవ్వగలదు. ఈ మిషన్ ద్వారా కృష్ణబిలాలు ఎక్కడెక్కడున్నాయో సులభంగా, తక్కువ సమయంలో గుర్తించవచ్చు.
breakthrough

బ్రేక్‌త్రో స్టార్‌షాట్

2036లో విడుదల కానున్న ఈ మిషన్ బ్రేక్‌త్రో ఇంటియేటీవ్స్ వారు రూపొందిస్తున్నారు.
లక్ష్యాలు : 20 సంవత్సరాలలో సమీప నక్షత్రాల గురించి చేధించాల్సిన రహస్యాలను కేవలం ఒక్క కక్ష్యలోనే చేధించగల సత్తా ఉన్న స్పేస్ మిషన్ ఇది. అంతరిక్షంలోనే అత్యంత ప్రకాశవంతమైన మూడవ నక్షత్రం మీదికి దీన్ని పంపనున్నారు.
ఏం ఆశిస్తున్నారంటే: 2016లో ఈ మిషన్‌ని ప్రకటించారు. అత్యంత ఆసక్తి కలిగించే సైఫై సినిమాలా ఈ మిషన్ ప్రయాణం సాగుతుంది. స్టార్‌చిప్స్ అనబడే వెయ్యి విద్యుద్దీపాల వేడిని తట్టుకోగల తెరచాపలా ఉంటుందీ మిషన్. సూర్యుడికి అతి దగ్గరలో ఉండే ఈ గ్రహం మీదకి ఈ మిషన్‌ని పంపుతున్నారు. అక్కడి వేడిని తట్టుకోగలిగేలా ఈ మిషన్ రూపొందించారు.
exomars-2020

ఎక్సోమార్స్ 2020

ఈఎస్‌ఏ, రాస్కోమాస్ కలిసి రూపొందిస్తున్న ఈ మిషన్ 2020లో లాంచ్ చేయనున్నారు.
లక్ష్యాలు : మార్స్ గ్రహం పుట్టుక నుంచి దాని పూర్వ చరిత్రతో సహ ప్రస్తుత పరిస్థితులు అధ్యయనం చేయడం
ఏం ఆశిస్తున్నారంటే: మార్స్ గ్రహం మీద ఇప్పటికే మొదటి దశలో వాతావరణ పరిస్థితులను అధ్యయనం చేసి విజయం సాధించింది. ఇప్పుడు జీవవైవిధ్యం, ఇతర వాతావరణ పరిస్థితుల మీద మరింత లోతుగా అధ్యయనం చేసే దిశగా ఈ మిషన్ పంపిస్తున్నారు. ఈ మిషన్ 2020 వరకల్లా మార్స్ మీద ల్యాండ్ అయి అక్కడి భూమిని తవ్వి పరిశీలించి ఫలితం పంపాలి. ఆ సమయంలో అక్కడ విడుదలయ్యే గాఢ రేడియేషన్‌ని కూడా తట్టుకోగల శక్తినిచ్చేలా ఈ స్పేస్ మిషన్ రూపొందించారు.
modern-space

మోడ్రన్ స్పేస్ రేస్

లక్ష్యాలు : అంతరిక్షంలోకి మానవులు ప్రయాణం చేసేందుకు, ఒక్కసారి ఉపయోగించిన వాహనాలను తిరిగి వాడేందుకు గల అనుకూలతల మీద ప్రయోగం
ఏం ఆశిస్తున్నారంటే: ఉదయం అంతరిక్షంలోకి వెళ్‌లి సాయంత్రానికి తిరిగి ఇంటికొచ్చేసేందుకు గల అనుకూలతలను తెలుసుకునేందుకు ఈ స్పేస్ మిషన్ ప్రయోగిస్తున్నారు. మళ్లీ మళ్లీ వాడగలిగేలా, అంతరిక్షంలోకి వెళ్లి తిరిగి రాగలిగేలా అక్కడి వాతావరణాన్ని తట్టుకునేలా రాకెట్లు తయారుచేసేందుకు కావల్సిన పరిస్థితులను ఈ స్పేస్ మిషన్ అధ్యయనం చేస్తుంది. కాకపోతే ఇది చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఇప్పటి వరకు ఎనిమిది అంతర్జాతీయ పర్యాటక సంస్థలు అంతరిక్షంలోకి ప్రయాణించాయి. ఒక్కోసారికి దాదాపు 20 నుంచి 40 డాలర్ల ఖర్చు అయింది. దీన్ని తగ్గించేందుకు ఉన్న సానుకూలతను, సాధ్యాసాధ్యాలను ఈ మిషన్ అధ్యయనం చేస్తుందన్నమాట.
బ్లూ ఆర్జిన్, స్పేస్ ఎక్స్, వర్జిన్ గెలాసిటిక్‌లతో కలిసి మరిన్ని కంపెనీలు రూపొందిస్తున్న ఈ స్పేస్ మిషన్ ప్రయోగ దశలో ఉంది.
jupiter-icy-moons

జూపిటర్ ఐసీవై మూన్స్ ఎక్స్‌ప్లోరర్ (జ్యూస్)

ఈఎస్‌ఏ రూపొందిస్తున్న ఈ స్పేస్ మిషన్‌ను 2022లో ప్రయోగించనున్నారు.
లక్ష్యాలు : జూపిటర్ (బృహస్పతి) గ్రహం మీదకు పంపనున్న ఈ మిషన్ అక్కడి నుంచి జూపిటర్ మీద ఉండే చంద్రగ్రహాన్ని పోలిన గనీమేడ్, కాల్లిస్టో, యూరోపా అనే మూడు గ్రహాలను అధ్యయనం చేస్తుంది.
ఏం ఆశిస్తున్నారంటే: 2022లో ప్రయోగించనున్న ఈ స్పేస్ మిషన్ 2030 కల్లా లక్ష్యాన్ని చేరుకుంటుందని భావిస్తున్నారు. జూపిటర్ గ్రహం మీద ఉన్న వాతావరణ పరిస్థితులు, మానవ మనుగడకు అనుకూల అంశాలు ఈ మిషన్ అధ్యయనం చేస్తుంది. జూపిటర్ గ్రహం చుట్టూ ఉన్న చల్లటి గ్రహాల నిర్మాణ వ్యవస్థను, అక్కడి శబ్ద తరంగాలను రికార్డు చేస్తుంది.
square-kilometer

స్కేర్ కిలోమీటర్ అర్రే

పన్నెండు దేశాలు కలిసి ఇంగ్లాండ్‌ని ప్రధాన కేంద్రంగా చేసుకుని ఈ స్పేస్ మిషన్ తయారుచేస్తున్నాయి. దీన్ని 2020లో ప్రయోగించనున్నారు.
లక్ష్యాలు : ప్రపంచంలోనే అత్యంత సున్నితమైన రేడియో టెలిస్కోప్‌ను సృష్టించడం, విస్తృతశ్రేణిలో ఉన్న కాస్మిక్ కిరణాలను గుర్తించడం ఈ మిషన్‌కు నిర్దేశించిన లక్ష్యాలు.
ఏం ఆశిస్తున్నారంటే.. 1990 నుంచే దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా ఖండాల్లో ఇప్పటికే 50 సార్లు సున్నితమైన టెలిస్కోప్‌లను ప్రయోగించారు. కాస్మోకిరణాల శక్తిని, వాటి తీవ్రత, ఉనికిని మరింత లోతుగా అధ్యయనం చేసే దిశగా ఈ మిషన్ ప్రయోగిస్తున్నారు. ఇది పూర్తి మిషన్ టార్గెట్‌లో పదిశాతం మాత్రమే ఇప్పుడు ప్రయోగిస్తున్నారు. ఇది సక్సెస్ అయితే రెండవ దశలో దాదాపు మూడు లక్షల సంవత్సరాల వరకు తరిగిపోని, దృఢమైన రేడియో తరంగాలను ఉత్పత్తి చేయగల శక్తి ఈ మిషన్‌కి ఉంది.

717
Tags

More News

VIRAL NEWS