సూపర్‌మ్యాన్ సూట్ వస్తున్నది!


Wed,November 15, 2017 01:37 AM

అగ్నికీలలు, విస్ఫోటనాలు, గనుల పేలుళ్ల నుంచి మానవ శరీరానికి తిరుగులేని రక్షణనిచ్చే ఒక అద్భుతమైన సూపర్‌మ్యాన్ సూట్‌ను శాస్త్రవేత్తలు అభివృద్ధి పరుస్తున్నారు. 2020 కల్లా ఇది వినియోగంలోకి రావచ్చంటున్నారు.

superman
మరో మూడేళ్లలో ప్రత్యేకించి రష్యన్ సైనికులకు అందుబాటులోకి రానున్న ఒక కృత్రిమ అగ్ని కవచం నమ్మశక్యం కాని విధంగా వారిని మంటలు, గ్రెనేడ్ బాంబుల పేలుళ్ల బారినుంచి రక్షిస్తుంది. దీనిని ధరించిన వారికి ఏకంగా అగ్నికీలలోంచి నేరుగా నడిచి వెళ్లగల శక్తి లభిస్తుందని శాస్త్రవేత్తలు ప్రకటించారు. సూపర్‌మ్యాన్ సూట్‌గా పిలుస్తున్న దీనిని ఆ దేశంలోని రాత్నిక్ (రష్యన్ సైన్యం) ప్రోగామ్‌లో భాగంగా అభివృద్ధి పరుస్తున్నారు. దీని ప్రత్యేకత ఉష్ణ నిరోధకం (heat resistant). అరామిడ్ (కృత్రిమ పాలిమైడ్స్) వంటి పదార్థంతో 2020 కల్లా తయారయ్యే ఈ సూటును ధరించిన వారు అర నిమిషం పాటు మంటలను ప్రత్యక్షంగా ఎదుర్కొనగలరని చెబుతున్నారు. రష్యాలో రాత్నిక్ సూట్స్ కొన్ని ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఒక శరీర కవచంతోపాటు తీవ్ర వెలుగు-చీకట్లోనూ చూడగల మోనోక్యులర్స్, ఇతర హైటెక్ పరికరాలు వంటివి ఉన్నాయి. ఇప్పటికే ఉన్న దానిని మించిన శక్తి సామర్థ్యంతో ప్రస్తుతం తర్వాతి తరం పోరాట పరికరంగా సూపర్‌మ్యాన్ సూట్‌ను రూపొందిస్తున్నారు. ఆకస్మిక అగ్ని విస్ఫోటనాలు వంటివి (ఉదా॥కు గ్రెనేడ్స్, గనుల బాంబులు పేలుళ్లు) సంభవించినప్పుడు భయోత్పాత తరంగం దీనిని ధరించిన వారిని ఒకింత గాయపరిచినా, తగు రక్షణ మాత్రం కల్పిస్తుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. అయితే, 2016లోనే రష్యా అప్పటి రాత్నిక్ సూట్స్‌ను వినియోగించింది. కాగా, ఈ కొత్త సూటులో ఉండే ఇన్‌బిల్ట్ జిపిఎస్ చిప్‌వల్ల కమాండర్లకు తమ సైనికులు ఎక్కడున్నదీ తెలిసిపోతుందని అంటున్నారు.

300
Tags

More News

VIRAL NEWS