అంతరిక్ష యానంతో మెదడులో మార్పులు


Wed,November 15, 2017 01:35 AM

సుదీర్ఘ అంతరిక్ష యానం వల్ల మానవ మెదడులో తీవ్ర మార్పులు కలిగే ప్రమాదం ఉందని ఒక కొత్త అధ్యయనం వెల్లడించింది. రానున్న నాసా అంగారక యాత్ర నేపథ్యంలో ఇది అత్యంత ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.
Brain
అంతరిక్షంలో సుదీర్ఘకాల ప్రయాణం వల్ల వ్యోమగాముల మెదళ్లలో గణనీయమైన మార్పులు సంభవించడాన్ని వైద్య నిపుణులు ఇటీవలి ఒక పరిశోధనలో గుర్తించారు. అవి ఎంత తీవ్రమంటే, మెదడుపై శరీర నిర్మాణ పరమైన శాశ్వత ప్రభావాన్నే చూపించాయని వారు తేల్చారు. రోదసిలోని ఐఎస్‌ఎస్ (అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం) నుండి తిరిగి వచ్చి అస్వస్థులైన వ్యోమగాములను రెండు (స్వల్పకాలం, మూడు నెలలు)గా విభజించి వారి మెదళ్ల స్కానింగ్స్‌ను పరిశీలించగా, పై ఫలితాలు వెల్లడైనాయి. 2033లో నాసా మార్స్ మిషన్‌కు సిద్ధమవుతున్న తరుణంలో ఈ పరిశోధనకు అత్యంత ప్రాధాన్యం లభిస్తున్నది. అంగారయానానికి పట్టే కాలం కనీసం 3 నుంచి 6 నెలలు. ఐఎస్‌ఎస్ రోదసీ నౌకలో ప్రయాణించిన నాసాకు చెందిన వ్యోమగాములకు అస్పష్ట దృష్టి, తల లోపల ఒత్తిడి పెరగడం అనుభవంలోకి వచ్చాయి. దీనిని విజువల్ ఇంపెయిర్‌మెంట్ ఇంట్రాక్రానియల్ ప్రెషర్ (విఐఐపి) సిండ్రోమ్‌గా నిపుణులు వ్యవహరిస్తున్నారు. దీనికి సరైన కారణం తెలియకున్నా, మైక్రోగ్రావిటీ ప్రభావం వల్ల దేహద్రవం తలవైపుకు పున:పంపిణీ అయి ఉండవచ్చునన్నది వారి భావన. మెదడు పైభాగమైన మోటార్ కోర్టెక్స్, దాని ప్రదేశాలు (gyri, sulci) తీవ్ర ప్రభావానికి లోనైనట్టు పై పరిశోధకురాలు డా॥ డొన్నా రాబర్ట్స్ వెల్లడించారు. అమెరికాలోని ది మెడికల్ యూనివర్సిటీ ఆఫ్ సౌత్ కరోలినాలో న్యూరోరేడియాలజిస్ట్‌గా పనిచేస్తున్న ఆమె ముఖ్యంగా మెదడులోని ఫ్రంటల్, పెరటిల్ లోబ్స్ అత్యంత దుష్ప్రభావానికి గురయ్యాయని తెలిపారు.

415
Tags

More News

VIRAL NEWS