ఫ్రీ మిల్క్ మాల్‌వేర్.. మీరు సేఫేనా?


Wed,November 15, 2017 01:28 AM

మెయిల్స్, డేటాను దొంగిలించడానికి కొత్తగా ఫ్రీ మిల్క్ అనే మాల్‌వేర్ వచ్చింది. ఈ మాల్‌వేర్‌ను ఎంటర్ చేయాలనుకునే హ్యాకర్లు.. అన్‌గోయింగ్ ఈమెయిల్ కన్వర్సేషన్ జరుగుతున్న మెయిల్ ఐడీలను గుర్తిస్తారు. అకౌంట్లను కంట్రోల్‌లోకి తీసుకొని కొత్త మెయిల్ కన్వర్సేషన్‌లోకి పంపిస్తారు. అది వేరే వ్యక్తి నుంచి వచ్చిందని మెయిల్ రిసీవ్ చేసుకున్న వాళ్లకు తెలియదు. ఇలా వచ్చిన థర్డ్‌పార్టీ మెయిల్లో బాడీ ట్రాప్డ్ ఫైల్స్ ఉంటాయి. ఫ్రీమిల్క్ వేర్ సిస్టంలోకి ఎంటరయితే పూ మిల్క్, ఫ్రీన్కిన్ అనే రెండు పేలోడ్స్ ఉంటాయి. ఇవి మాలిషియస్ కోడ్స్ ద్వారా కంప్యూటర్‌ను ఇన్‌ఫిల్టరేట్ చేస్తాయి. కాన్ఫిడెన్షియల్ డేటాను దొంగిలిస్తాయి. ఈ ప్రాసెస్ జరుగుతున్నట్లు యూజర్ ఏమాత్రం తెలియదు. దీనిని అడ్డుకోవాలంటే లేటెస్ట్ ఓఎస్ వాడాలి. ఆటోమెటిక్ అప్‌డేట్స్‌ను అనేబుల్ చేసుకోవాలి. రెగ్యులర్‌గా వాటిని డౌన్‌లోడ్ చేసుకొని అప్‌డేట్ చేసుకోండి. నెట్‌వర్క్ బేస్డ్ ఎటాక్స్ నుంచి కాపాడుకోవడానికి ఫైర్‌వాల్స్ ఉన్నాయో లేదో చూసుకోండి. తెలియని ఈమెయిల్స్ నుంచి వచ్చిన స్టఫ్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ డౌన్‌లోడ్ చేసుకోవద్దు. లేటెస్ట్ అప్‌డేటెడ్ యాంటీ వైరస్, సెక్యూరిటీ ప్యాచెస్ వాడుకోండి.
Tiptak

365
Tags

More News

VIRAL NEWS