ఆస్ట్రేలియాలో సంధ్యారాగం


Wed,September 13, 2017 01:04 AM

విభిన్న రంగాల్లో ప్రతిభ చూపుతూ ప్రపంచవ్యాప్తంగా స్వరాష్ట్ర ఖ్యాతిని చాటిచెబుతున్నారు తెలంగాణ ఎన్నారైలు. పలు దేశాల్లో రాజకీయంగానూ సత్తా చాటుతున్నారు. ముఖ్యంగా మన ఆడబిడ్డలు ఖండాంతరాల్లో తెలంగాణ జెండాను రెపరెపలాడిస్తున్నారు. ఇలాంటి కోవకే చెందుతారు సంధ్యారెడ్డి.హైదరాబాలో పుట్టి పెరిగిన సంధ్యారెడ్డి ఇప్పుడు ఆస్ట్రేలియాలో స్థిరపడ్డారు. అంతేకాదు అక్కడ జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీచేస్తున్నారు. తద్వారా.. ఆస్ట్రేలియన్ రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్న తొలి తెలంగాణ బిడ్డగా ఆమె చరిత్ర సృష్టిస్తున్నారు.
sandhya-reddy

మేయర్‌తో పోటీ

ఖైరతాబాద్‌లో నివాసముండే పట్లోళ్ల శంకర్‌రెడ్డి చిన్న కూతురు సంధ్యారెడ్డి. 2000 సంవత్సరంలో ఆస్ట్రేలియాకు వెళ్లిపోయారు. ఇప్పుడామె సిడ్నీలోని మున్సిపాలిటీ ఎలక్షన్స్‌లో పోటీ చేస్తున్నారు. పోటీ ఆషామాషీ వ్యక్తితో కాదు. ప్రస్తుత మేయర్ ఆడ్య్రూసోలోస్‌కు పోటీగా ఆమె రంగంలోకి దిగారు. ఆమెకు అక్కడున్న భారతీయులు, భారతీయ సంస్థల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తున్నది. ఆమె విజయం కోసం వందల సంఖ్యలో వలంటీర్లు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.

తెలంగాణకు గర్వకారణం

ఆస్ట్రేలియన్ పాలిటిక్స్‌లోకి తెలంగాణ బిడ్డలు ప్రవేశించడం తనతో మొదలవుతుండడం గర్వంగా ఉందంటున్నారు సంధ్య. ఆస్ట్రేలియన్ నేషనల్ జూనియర్ చెస్ చాంపియన్‌షిప్ 2017 టైటిల్‌ను గెలుచుకున్న నిఖిల్ రెడ్డి సంధ్యారెడ్డి కుమారుడే కావడం విశేషం.
sandhya-reddyV

674
Tags

More News

VIRAL NEWS