పిల్లల్ని చూసి మురిసిపోండి!


Wed,September 13, 2017 01:02 AM

అరే.. ఏమున్నవ్ బుజ్జీ.. అరరే.. మస్తు ముద్దొస్తున్నవ్ పో! నీ బుగ్గలు బూరెల్లెక్కనే ఉన్నయ్‌గా.. ఏదేమైనా నీ కల్మషం లేని చూపుల్తో నన్ను కట్టిపడేశావ్ చిట్టీ అని మొన్న ప్రధాని నరేంద్రమోడీ ఓ పాపాయితో నలభై నిమిషాలు ఆడుకున్నాడు. ఆమె పేరు మెదీనా. తన చూపుల్తో ఎవ్వరినైనా ఫిదా చేస్తుందట మెదీనా!
Medina
చాలామంది అంటుంటారు కదా.. బయట ఎక్కడెక్కడో పనుల మీద తిరిగి ఇంటికొచ్చి పసిపిల్లల్ని ముద్దాడగానే మనుసు ఒక్కసారిగా తేలికవుతుందని. అది వందకు వంద శాతం నిజమంటున్నారు ప్రముఖ గాయకుడు అద్నాన్ సమీ ఆయన భార్య రోయా ఫర్యాబీ. ఎలాంటి సమస్యలున్నా తమకు మెదీనా ముసి ముసి నవ్వుల చూపులు చూడగానే బరువు దించేసుకున్నట్లు అవుతుందని వారు అన్నారు. ఇదంతా వాళ్లు ఎందుకు చెప్తున్నారంటే ప్రధాని నరేంద్రమోడీని మర్యాదపూర్వకంగా కలిశారు వాళ్లు.

యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న మోదీ.. మెదీనాను చూసి ముచ్చటపడి పోయారట. ఈ పాపను చూస్తుంటే తనకెంతో సంబురంగా ఉందని అని బుగ్గలు గిల్లి ముద్దు చేశాడట. ప్రధాని మోడీనే తమ పాపాయి ఫిదా చేయడం తమ అదృష్టంగా భావిస్తున్నామనీ.. ఒక్క తమ పాపాయే కాదు.. ప్రతి ఒక్కరి ఇంట్లో చిన్నారి పిల్లల్ని.. వారి కల్మషం లేని ముఖాల్ని చూస్తూ మురిసిపోవాల్సిందేనని సమీ, రోయా అంటున్నారు. పిల్లలతో ఉంటే కొత్త ఎనర్జీ వస్తుందనేది తాము గ్రహించామని వాళ్లు చెప్తున్నారు.

523
Tags

More News

VIRAL NEWS