ఆయిల్ పెడుతున్నారా?


Wed,September 13, 2017 01:01 AM

ఈ రోజుల్లో తలకు నూనె పెట్టే అలవాటున్నవాళ్లు చాలా తక్కువే అని చెప్పాలి. తలకు నూనె పెడితే ముఖం జిడ్డుబారి అంద విహీనంగా కనిపిస్తామంటూ మరికొందరైతే నూనె ఊసెత్తడానికే చిరాకుపడుతారు. కానీ దాని విలువ తెలిస్తే మాత్రం ఆలోచనల్లో మార్పు వస్తుంది.
Oil-Applying
తలకు క్రమంగా కొబ్బరి నూనె పట్టించి మర్దనా చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయట. ముఖాన్ని ఎప్పటికప్పుడు కడుక్కున్నట్లు తలను రోజులో మూడునాలుగు సార్లు కడుగలేం కదా.. కాబట్టి నూనె రాయడం వల్ల అది వెంట్రుకలకు ఒక పొరలాగా ఏర్పడి కాలుష్య కారకాల వల్ల జుట్టు పాడవకుండా రక్షిస్తుంది. అతి నీలలోహిత కిరణాల బారినుంచి కాపాడుతుంది. వెంట్రుకలు తెల్లబడకుండా ఉండడంలో కొబ్బరినూనె బాగా పనిచేస్తుంది. అంతేకాదు ఫంగల్, డాండ్రఫ్ సమస్యల నుంచి కూడా కాపాడుతుందట. వేడి వాతావరణం నుంచి తలను కొబ్బరినూనె కాపాడడమే కాకుండా కుదుళ్లు బలపడుతాయి. తలకు నూనె పట్టించడం వల్ల మెరుగైన రక్తప్రసరణ జరుగుతుంది.

564
Tags
data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">

More News

VIRAL NEWS