స్ఫూర్తిప్రదాత!


Wed,September 13, 2017 12:58 AM

సాయి కౌస్తువ్ దాస్‌గుప్తా 90శాతం దివ్యాంగుడు. కానీ ఆయనొక సింగర్, గ్రాఫిక్ డిజైనర్. అంతేకాదు.. అందరిలో స్ఫూర్తి పెంచే మోటివేషనల్ స్పీకర్ కూడా.
puttaparthi
ఆంధ్రప్రదేశ్‌లోని పుట్టపర్తిలో జన్మించిన సాయి చిన్నప్పుడు అందరిలాగే ఆడిపాడుతుండేవాడు. 2001లో బాత్రూమ్‌లో పడిపోయాడు. అప్పుడు మోకాళ్లు ఫ్యాక్చర్ అయ్యాయి. అది మొదలు ఇప్పటిదాకా ఒంట్లో 50 ఫ్యాక్చర్‌లు అయ్యుంటాయి. ఇన్ని ఫ్యాక్చర్‌లకు కారణం అతను పడడం కాదు. ఒక వింతైన జబ్బుతో బాధపడడమే! 20వేలల్లో ఒకరికి వచ్చే బ్రిటిల్ బోన్ డిసీజ్‌తో బాధపడుతున్నాడు సాయి. స్కూలుకి వెళ్లాలన్నా వీల్ చెయిరే గతయింది. కానీ అతని ఆత్మవిశ్వాసం ఎక్కడా సడలలేదు. అమ్మతో కలిపి సంగీతం నేర్చుకున్నాడు. ఎన్నో అవార్డులను గెలుచుకున్నాడు. పైగా 150పాటలకు ట్యూన్ కట్టి ఐదు మ్యూజిక్ ఆల్బమ్‌లను కూడా విడుదల చేశాడు.

అతడి పాటల ప్రస్థానంలో కూడా ఎన్నో ఆటంకాలు ఎదురయ్యాయి ఫ్యాక్చర్ల రూపంలో. కానీ సాయి మాత్రం మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగాడు. పాటలొక్కటే కాదు.. ఇంకా ఏదైనా చేయాలని గ్రాఫిక్ డిజైన్ నేర్చుకున్నాడు. ఎడమ చేతి రెండు వేళ్లు మాత్రమే కదులుతాయి. వాటితో ఎన్నో కంపెనీలకు గ్రాఫిక్ వర్క్‌లు చేసి ఇచ్చాడు. 2012లో ఒక స్వచ్ఛంద సంస్థలో డిజైనర్‌గా చేరాడు. ఇంటర్ అయ్యాక డిగ్రీ చేయాలని ఎంతో ఆశపడ్డాడు. కానీ అప్పుడే మరిన్ని ఫ్యాక్చర్‌లు కావడంతో ఆరు సంవత్సరాల పాటు మంచానికే పరిమితమయ్యాడు. అప్పుడు కూడా డిప్రెషన్‌లోకి వెళ్లలేదు సాయి. ఆ సమయంలో పుట్టినందుకు ఏదో ఒకటి చేయాలన్న ఆలోచన మొదలైంది. స్కైప్‌లో మోటివేషనల్ క్లాస్‌లు చెప్పడం ప్రారంభించాడు.

అతడి మాటలు ఎంతోమందికి స్ఫూర్తినిచ్చాయి. అతడి ధైర్యమే అతడిని మళ్లీ కూర్చునేలా చేసింది. 2015లో మంచం నుంచి వీల్‌చెయిర్‌లో తిరిగే భాగ్యం దక్కింది సాయికి. ఒక ట్రావెల్ పోర్టల్ కంపెనీ దివ్యాంగులు ట్రావెలింగ్ మీద ఒక కాంపిటీషన్ నిర్వహించింది. అందులో 16 గంటల్లో కారు జర్నీ చేసి గోవా చేరుకొని ఆ కాంపిటీషన్‌ని గెలిచాడు. 90శాతం దివ్యాంగుడైన సాయి ఇప్పటికి ఎంతోమందికి ఆదర్శంగా నిలిచాడు. ఎవరితోనూ మిమ్మల్ని పోల్చుకోవద్దు. మీరు చేసే పనిలో మంచి ఉండాలి. మీలో ఉండే నైపుణ్యాలు, సామర్థ్యాలను వెలికి తీసినప్పుడే విజయాన్ని సాధిస్తారు అంటున్నాడు సాయి.

308
Tags

More News

VIRAL NEWS

Featured Articles