పొదుపు ఖాతా వర్సెస్ పేమెంట్ బ్యాంక్ ఖాతా


Sat,January 19, 2019 01:34 AM

payments-bank
బ్యాంకుల్లో లభించే పొదుపు ఖాతాతో పోలిస్తే పేమెంట్ బ్యాంకింగ్ సేవలు అందిస్తున్న సంస్థలు ఆఫర్ చేస్తున్న ఖాతాలు ఏమేర ప్రయోజనం కలిగిస్తున్నాయో తెలుసుకుందాం..

గ్రామాల్లో నివసిస్తున్న వారికి బ్యాంకింగ్ సేవలు అందించాలనే ఉద్దేశంతో ప్రధాని నరేంద్ర మోదీ గతేడాది సెప్టెంబర్ 1న అంగరంగ వైభవంగా తపాలాశాఖ పేమెంట్ బ్యాంక్ సేవలను ఆరంభించారు. ఇందుకోసం దేశవ్యాప్తంగా 3,250 యాక్సెస్ పాయింట్లు, 650 శాఖలను నెలకొల్పింది. ప్రతి భారతీయుడికి బేసిక్ ఆర్థిక సేవలను అందించాలనే ఉద్దేశంతో ఈ వినూత్నానికి శ్రీకారం చుట్టింది. తపాలశాఖతోపాటు మరో ఐదు ప్రైవేట్ సంస్థలు కూడా ప్రజలను ఆకట్టుకోవడానికి ఇలాంటి సేవలను ఆరంభించాయి కూడా. ప్రస్తుతం పొదుపు ఖాతాలపై ప్రధాన బ్యాంకులు అందిస్తున్న సేవలతో పోలిస్తే పేమెంట్ బ్యాంకులు అందిస్తున్న సేవలు బ్యాంకింగ్ రంగం రూపురేఖలు మార్చివేయనున్నది. వీటిలో కొన్నింటి గురించి తెలుసుకుందాం..

వడ్డీరేట్లపై ఆఫర్లు కూడా..

రిజర్వు బ్యాంక్ మార్గదర్శకాలకు లోబడి పేమెంట్ బ్యాంక్‌లో పొదుపు ఖాతాను ప్రారంభించినవారికి డిపాజిట్లపై కనీసంగా నాలుగు శాతం వడ్డీని ఆఫర్ చేస్తుండగా.. గరిష్ఠంగా 7.5 శాతం వడ్డీని అందిస్తున్నాయి. మరోవైపు పొదుపు ఖాతాలపై అత్యధికంగా ఆర్జించాలనే ఆలోచన మాత్రం చేయకండి. ఎందుకంటే ఆయా సంస్థలు లేదా ఆర్థిక సేవల సంస్థలు 5 శాతం మాత్రమే వడ్డీని ఆఫర్ చేస్తుండగా, దీనిని 6 లేదా 6.25 శాతం వరకు చెల్లించవచ్చును. ఒకవేళ సున్న బ్యాలెన్స్ పొదుపు ఖాతా తీసుకుంటే దీనిపై మీకు 3 శాతం లేదా 4 శాతం ఆదాయం లభించనున్నది.

కనీసంగా కొంతమేర డిపాజిట్ చేయాలి..

దేశవ్యాప్తంగా ఉన్న అధిక పేమెంట్ బ్యాంకులు జీరో బ్యాలెన్స్ పొదుపు ఖాతాను ఆఫర్ చేస్తున్నాయి. అంటే పొదుపు ఖాతాల్లో కనీసం నగదు నిల్వ ఉంచకూడదని కాదు..ఈ ఖాతాల్లో కొంతమొత్తమైన డిపాజిట్ చేయాలి. ఇతర బ్యాంకులు కూడా ఇదే తీరుగా ఆఫర్‌ను అందిస్తున్నాయి.

ఏటీఎం/డెబిట్ కార్డులు కూడా..

ప్రధాన బ్యాంకులు ఇస్తున్న ఏటీఎం/డెబిట్ కార్డులు కూడా ఈ పేమెంట్ బ్యాంకులు అందిస్తున్నాయి. రిజర్వు బ్యాంక్ మార్గదర్శకాలమేరకు పేమెంట్ బ్యాంకులు ఈ రెండు కార్డులను జారీ చేయడానికి అధికారం కలిగివున్నాయి. ఖాతాను ప్రారంభించే సమయంలోనే డిజిటల్ కార్డు కావాలని ఖాతాదారుడు కోరాల్సి ఉంటుంది. దీంతో వెంటనే ఈ కార్డును వినియోగదారుడికి ఆయా బ్యాంక్ అందించనున్నది. ఇప్పటికే తపాలాశాఖ డెబిట్/ఏటీఎం కార్డును అందచేస్తున్నాయి. కానీ, రెగ్యులర్ సేవింగ్ ఖాతాలకు ఈ రెండు రకాల కార్డులను అందించడం అంత సులువుకాదు మరి.

కనీస మొత్తాన్ని నిర్వహించుకోవాలి..

ఇటీవల అందుబాటులోకి వచ్చిన తపాలాశాఖ పేమెంట్ బ్యాంక్‌లో కనీస నగదు నిల్వలు లేకుండా ఉన్న ఖాతాపై ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మిగతా బ్యాంకుల్లో పొదుపు ఖాతాల్లో కనీసంగా నగదు ఉంచాల్సి ఉంటుంది, కానీ పేమెంట్ బ్యాంకుల్లో అలాంటి నిబంధనలు ఏమిలేవు. అయినప్పటికీ బ్యాంకులు..బ్యాంకుల మధ్య తేడాలు కూడా ఉంటాయి. జీరో బ్యాలెన్స్ అకౌంట్ తీసుకున్నవారు ఈ ఖాతాల్లో ఎలాంటి డబ్బు ఉంచాల్సిన అవసరం లేదు. రిజర్వు బ్యాంక్ మార్గదర్శకాలకు లోబడి గరిష్ఠంగా లక్ష రూపాయల వరకు నగదును ఉంచుకునేందుకు ఖాతాదారుడికి అవకాశం ఉంటుంది.

ఉచిత లావాదేవీలు పరిమితమే..

ఏటీఎం/డెబిట్ కార్డు వచ్చిందని మురిసిపోవద్దు. ఎందుకంటే ఈ కార్డు ద్వారా ఇష్టం వచ్చినప్పుడు, ఎన్నైనా సార్లు డబ్బును విత్‌డ్రా చేసుకుంటామంటే కుదరదు. ఎందుకంటే ఈ కార్డులపై పరిమితులు విధించాయి. ఆయా సంస్థలకు చెందిన ఏటీఎంల్లో ఉచిత విత్‌డ్రా పరిమితులతోపాటు ఇతర ఏటీఎంల్లో పరిమితికి మించి లావాదేవీలు జరిపితే జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. మీరు పేమెంట్ బ్యాంక్‌లో పొదుపు ఖాతా తీసుకునే సమయంలోనే స్థిరమైన ఉచిత ఏటీఎం/డెబిట్ కార్డుల పరిమితులను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకు మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన పేమెంట్ బ్యాంక్..మూడుసార్లు ఉచిత ఏటీఎం లావాదేవీలు కల్పిస్తుండగా, మరో సంస్థ నెలకు రూ.25 వేలు ఆఫర్ చేస్తున్నాయి.

అదనపు ఆర్థిక సేవలు కూడా..

బ్యాంకులు పొదుపు ఖాతా కలిగివున్నవారికి ఆయా సంస్థ ఇతర సేవలు సైతం అందించనున్నది. ముఖ్యంగా రుణాలు తీసుకోవడం, ఒవర్‌డ్రాఫ్ట్ లేదా క్రెడిట్ కార్డు, పెట్టుబడులు పెట్టేందుకు సలహాలు, సూచనలు చేయనున్నది. వీటితోపాటు బ్యాంక్ స్టేట్‌మెంట్లు, ఖాతాలో నగదు, ఆన్‌లైన్‌లో నగదును పంపుకోవచ్చును కూడా. వీటితోపాటు ఉచిత టాక్‌టైం, క్యాష్‌బ్యాక్ లేదా లక్ష రూపాయల వరకు వ్యక్తిగత ప్రమాద బీమా లభించనున్నది.

Adhil-Shetty
అధిల్ శెట్టి
బ్యాంక్ బజార్.కామ్ సీఈవో

652
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles