పీఎంఆర్‌పీవై లబ్ధిదారులు కోటిపైనే


Sat,January 19, 2019 01:25 AM

EPFO
ప్రధాన మంత్రి రోజ్‌గార్ ప్రోత్సాహన్ యోజన (పీఎంఆర్‌పీవై) నుంచి లబ్ధి పొందిన ఉద్యోగుల సంఖ్య కోటి మార్కును దాటింది. ఆయా సంస్థలకు ప్రోత్సాహకాల ద్వారా కొత్తగా ఉపాధి అవకాశాలను సృష్టించడమే ఈ పథకం అసలు ఉద్దేశం. 2016 ఏప్రిల్ 1 తర్వాత ఈపీఎఫ్‌వోలో నమోదై, నెలకు రూ.15,000 వరకు జీతమున్న కొత్త ఉద్యోగులకు ఈ పథకం కింద మూడేండ్లపాటు అటు ఎంప్లాయ్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్), ఇటు ఎంప్లాయ్ పెన్షన్ స్కీం (ఈపీఎస్)ల కోసం సంస్థల తరఫున మొత్తం 12 శాతం విరాళాన్ని ప్రభుత్వమే చెల్లిస్తున్నది. ఉపాధి కల్పనకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న పథకం పీఎంఆర్‌పీవై. ఈ నెల 14 నాటికి ఈ పథకం కింద ప్రయోజనం పొందిన లబ్ధిదారుల సంఖ్య కోటికిపైగానే ఉన్నది అని కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.


2016 ఆగస్టు 7న పీఎంఆర్‌పీవైని మోదీ సర్కారు ప్రకటించింది. ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌వో) ద్వారా కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ ఈ పథకాన్ని అమలు చేస్తున్నది. కాగా, 2016-17 ఆర్థిక సంవత్సరంలో 33,031 మంది, 2017-18 ఆర్థిక సంవత్సరంలో 30,27,612 మంది, ప్రస్తుత 2018-19 (జనవరి 15దాకా) ఆర్థిక సంవత్సరంలో 69,49,436 మంది లబ్ధిదారులున్నారు. అలాగే ఈ పథకాన్ని వర్తింపజేసుకున్న సంస్థలు 1.24 లక్షలుగా ఉన్నాయి. ఎలాంటి అక్రమాలకు తావులేకుండా ఆన్‌లైన్, ఆధార్ ఆధారిత వ్యవస్థపై ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. ఈ ఏడాది మార్చి 31తో పీఎంఆర్‌పీవై కింద సంస్థలు అందుకుంటున్న ప్రయోజనాలకు కాలం తీరనున్నది.

323
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles