పదవీ విరమణకు 7 అడుగులు


Sat,January 12, 2019 01:10 AM

retirement
ఉద్యోగం సంపాదించడం ఎంత కష్టమో..వచ్చిన తర్వాత ఆ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించడం కూడా అంతే కష్టం. పగలనక, రాత్రి అనకా కష్టపడి విధులు నిర్వహించి అటు జీవితాన్ని, ఇటు సంసారాన్ని మోసుకొచ్చిన వారికి పదవీ విరమణ ఒక విధంగా సువర్ణయుగం లాంటిది. రిటైర్‌మెంట్ తర్వాత ఇక తాము ఉద్యోగం చేసే సమయంలో చేయలేని పనులు, ముఖ్యంగా కుటుంబానికి దూరంగా ఉన్నవారి వీటికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వనున్నారు. పదవీ విరమణకు ముందు తీసుకోవాల్సిన ఏడు అడుగులపై నిశితంగా పరిశీలిద్దాం..అవే ఇవి..


1 అత్యవసర సమయంలో ఇదే ఆపన్న హస్తం

మీ కుటుంబ సభ్యులు అత్యవసరంగా ఆసుపత్రిలో చేరారు..చికిత్సకు లక్షల్లో ఖర్చు అవుతుందని డాక్టర్ చెప్పారనుకో. అప్పుడు మీ పరిస్థితి ఏంది. అందుకే ముందే మేల్కోని పొదుపు చేయండి. ఇదే అత్యవసర సమయంలోను, శుభకార్యాలు జరిగేటప్పుడు ఇది సంజీవనిలాగా పనిచేస్తున్నది. ఏడాదిలో మూడు నుంచి ఆరు నెలల వరకు మీరు సంపాదించిన జీతం/ఆదాయాన్ని ఫిక్స్‌డ్ డిపాజిట్లు లేదా పొదుపు బ్యాంక్ ఖాతాల్లో జమచేసిన డబ్బు ఉపయోగపడనున్నది. ఊహించని ఉపద్రవాల నుంచి ఉపశమనం లభించాలంటే ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలి మరి. వీటిలో పొదుపుకు పెద్దపీట వేయాల్సిన అవసరం ఉన్నది.


2 పొదుపుపై ప్రత్యేక దృష్టి

ఉద్యోగం పొందిన ఏడాది నుంచే పొదుపుపై ప్రత్యేక దృష్టి సారించాలి. అత్యవసర సమయంలో ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. నెలకు సంపాదించిన జీతంలో కనీసంగా 10 శాతమైన పొదుపు చేయాలి. విద్యా, ఇతర రుణాలు లేనివారు మాత్రం గరిష్ఠంగా 25 శాతం వరకు చేయాలి. పొదుపు భవిష్యత్తుకు పునాదిలాంటిది. ఈ దిశగా ఆలోచించేవారు లేకపోవడం పలు సమస్యలకు తావిస్తున్నది. పదవీ విరమణకు సంబంధించి చిన్న వయస్సు నుంచే ఆలోచించాలి, అప్పుడే భవిష్యత్తు అందకారం కాకుండా అడ్డుపడనున్నది.


3 ఆస్తులను కూడబెట్టు కోవడం

ఆస్తులను కూడబెట్టుకోవడానికి పెద్దపీట వేయాలి. స్థిర, చర ఆస్తుల్లో ఏదైన సరే ఓకే. ప్రస్తుతం టీవీ, రిఫ్రిజిరేటర్లు, ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్లకు కేటాయిస్తున్న నిధులను రియల్ ఎస్టేట్ రంగం వైపు మళ్లించండి. మెట్రోనగరాల్లో ఆస్తులను కొనుగోలు చేయడం ఖర్చుతో కూడుకున్న పని, కానీ చిన్నస్థాయి నగరాల్లో కొనుగోలు పెద్ద కష్టమైనది కాదు, కావున ప్రతి ఒక్కరు వీటిపై దృష్టి సారించాలి. మిగతా వాటితో పోలిస్తే రియల్ ఎస్టేట్ రంగం అధిక రిటర్నులను పంచుతున్నది. తద్వారా పన్ను ప్రయోజనాలు కూడా పొందవచ్చును. ఒకవేళ దిద్దుబాటుకు గురైన సమయంలో ఇవే ప్రత్యామ్నాయం.


4 పెట్టుబడులను వివిధీకరించండి..

పెట్టుబడులను ఒకేదాంట్లో కాకుండా వివిధ రూపాల్లో ఇన్వెస్ట్ చేస్తే మంచిది. పాత విధానంలో ఒకేదాంట్లో కుక్కడం వల్ల ఎలాంటి ప్రయోజనం పొందే అవకాశాలు చాలా తక్కువ. ఒకవేళ వివిధ దాంట్లో పెడితే ఈ రంగం భారీ వృద్ధిని నమోదు చేసుకుంటే ఆర్థికంగా బలోపేతం అవడానికి దోహదపడనున్నది. ముఖ్యంగా ఈక్విటీ, బంగారం, రియల్ ఎస్టేట్ రంగాలు ఇందులో కొన్ని. మీరు పనిచేసే సమయంలో ప్రావిడెంట్ ఫండ్ కింద చెల్లించే 12 శాతం పదవీ విరమణ చేసిన తర్వాత ఎంతో ఉపయోగకరంగా ఉండనున్నాయి. అలాగే సుఖన్య సమృద్ధి యోజన పథకం కింద మీ కుతురిపై జమ చేసిన సొమ్ము కూడా ఆ అమ్మాయి ఎదుగుతున్న సమయంలో అధిక మొత్తంలో లభించనున్నది. ఈక్విటీలో పెట్టుబడులు పెట్టేముందు మార్కెట్ విశ్లేషకుల ఆలోచనలకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవడం మరిచిపోకండి. ఉదాహరణకు అధిక మొత్తంలో గృహ రుణం తీసుకున్నవారు వారి జీవిత విధానాలు, ఇతర ఆస్తులను కొనుగోళ్లపై ప్రభావం చూపనున్నాయి.


5 పెట్టుబడులపై సమీక్షించండి

తాము పెట్టిన పెట్టుబడులపై అప్పుడప్పుడైనా పర్యవేక్షిస్తుండాలి. రోజు లేదా నెల కొకసారి కాకుండా మూడు లేదా ఆరు, ఏడాదికొకసారి సమీక్షించుకోవాలి. ఎందుకంటే ఆస్తులకోసం కూడబెట్టడంతో పదవీ విరమణ చేసిన తర్వాత తాము నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకోవడానికి సులభంకానున్నది. ఈక్విటీ పెట్టుబడులను బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్లను ఆరు నుంచి తొమ్మిది నెలలపాటు చేస్తే భవిష్యత్తుకు ఢోకా ఉండదు. రిటైర్‌మెంట్ తర్వాత ఇవి రిటర్నులు పంచనున్నాయి.


6 చిన్న వయస్సునుంచే..

మీ భద్రతే మీకు శ్రీరామరక్ష. అలాంటి మంచి అలవాట్లను చిన్నప్పటి నుంచి అలవాటు చేసుకోవాలి. బీమా, ఆరోగ్యానికి సంబంధించిన భద్రతకు పెద్దపీట వేయడానికి యువత ముందుకురావాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యంగా మీ కుటుంబం మొత్తం భద్రత కల్పించే బీమాను తీసుకోవాలి. ఒకవేళ ప్రమాదం జరిగినప్పుడు గానీ, ఏదైన అత్యవసర సమయంలో వచ్చే రోగాలు, ముఖ్యంగా మలిదశలో వచ్చే రోగాల నుంచి కాపాడుకోవడానికి బీమా సర్వరోగ నివారణిలాగా పనిచేస్తున్నది. యవ్వన వయస్సులో బీమా పాలసీకోసం తక్కువ స్థాయిలో చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. కానీ, మలిదశలో మాత్రం ఎక్కువగా ఉంటుంది. పదవీ విరమణను దృష్టిలో పెట్టుకొని హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకోండి.


7 విశ్లేషకులు అభిప్రాయాలు తీసుకోండి..

విశ్లేషకుల అభిప్రాయాలకు పెద్దపీట వేయండి. ఆరోగ్యానికి సంబంధించి ఎలా మెడికల్ చెకప్ చేసుకుంటారో అలాగే ఆర్థిక అనుభవజ్ఞుల నుంచి సలహాలు, సూచనలు తీసుకోండి. మీ బ్యాంక్ మేనేజర్ లేదా మంచి స్నేహితుడు/పొరుగువారు ఆర్థిక పరిజ్ఞానం ఉన్న ఎవరి నుంచైనా వారి సహాయం తీసుకోవడానికి వెనుకంజ వేయకండి.
madhusudan

765
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles