జీవితబీమా రాబడి ఖాయం భరోసా అదనం


Sat,January 12, 2019 01:01 AM

Insurance
శరణ్య ఓ బ్యాంక్ ఉద్యోగి. జీవితంలో కచ్చితమైన లక్ష్యాలను కలిగి ఉన్న వ్యక్తి. పొదుపు చేయడమే లక్ష్యంగా ఆర్థిక ప్రణాళికను రూపొందించుకున్నారు. అయితే, గత కొంత కాలంగా బ్యాంక్ వడ్డీ రేట్లు తగ్గుతూ ఉన్న కారణంగా తన ఫైనాన్షియల్ ప్లానింగ్ ఏదో లోపం ఉన్నట్టు గుర్తించారు. ప్లానింగ్‌లో రిస్క్ ఉన్నట్టు గమనించారు. వివాహం, విహారయాత్రలు, పిల్లల విద్య, పదవి విరమణ తదితర జీవిత లక్ష్యాలను ప్రస్తుతం ఫైనాన్షియల్ ప్లానింగ్‌తో సాధించడం సాధ్యం కాదని గమనించారు. దీనికి తోడు పొదుపు ప్రణాళిక కుటుంబ భద్రతకు భరోసా ఇవ్వడం లేదని భావించారు. రూపాయి మారకం విలువ పతనం, అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధర పెరుగుదలకు తోడు వడ్డీరేట్లు పెరగకపోవడం, స్టాక్ మార్కెట్ స్తబ్దుగా ఉండడం వంటి అంశాలు చాలా మంది ఇన్వెస్టర్ల మాదిరిగానే శరణ్యనూ మనోవేదనకు గురిచేస్తున్నాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో కచ్చితమైన రాబడులను ఇవ్వగలిగిన ఇన్వెస్ట్‌మెంట్ ప్రణాళిక అవసరం అందరికీ కనిపిస్తున్నది.


నిర్దేశిత కాలానికి మనకు ఎంత రాబడి కావాలో స్పష్టత ఉంటే మంచిది. అయితే ఇలాంటి ఇన్వెస్ట్‌మెంట్ ప్రణాళికకు ప్రస్తుతం ఉన్న సంప్రదాయ పద్దతుల్లో కనిపిస్తున్న సాధనాలేవీ లేవు. అందుకే గ్యారంటీ రాబడులను ఇవ్వగల ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్లను మొదట అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మార్కెట్ పరిస్థితులు, వడ్డీరేట్లలో హెచ్చుతగ్గులతో సంబం ధం లేకుండా మనకు కచ్చితమైన రాబడిని ఇవ్వగలగాలి. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో జీవిత బీమాకు హామీ ఇసూన్న గ్యారంటీ రాబడులను ఇవ్వగల లైఫ్ ఇన్సూరెన్స్ ఉత్పత్తులు అనేకం మార్కెట్‌లో లభిస్తున్నాయి. ఇలాంటి సాధనాలు ఆకర్షణీయంగా కూడా ఉన్నాయి.


దీర్ఘకాలానికి కచ్చితమైన రాబడి

ఇతర సంప్రదాయ పొదుపు సాధనాలతో పోల్చితే గ్యారంటీ రాబడికి తోడు జీవిత బీమాను కల్పిస్తూ దీర్ఘకాలానికి పన్ను మినహాయించిన రాబడిని మెరుగ్గా ఇవ్వగలిగినవి లైఫ్ ఇన్సూరెన్స్ ఉత్పత్తులే.

Insurance1

బీమా, పొదుపుల సమ్మేళనం

ఇలాంటి కచ్చితమైన రాబడిని ఇవ్వగల లైఫ్ ఇన్సూరెన్స్ ఉత్పత్తులు రెండు రకాలుగా ప్రయోజనాలను అందిస్తాయి. జీవిత బీమా మొదటి అయితే క్రమం తప్పకుండా నిర్ణీత సమయంలో సొమ్మును వెనక్కి తీసుకునే సదుపాయాన్ని కల్పించడం. భద్రతకు తోడు తమ ఇన్వెస్ట్‌మెంట్ కూడా కాల క్రమేణా పెరుగుతూ ఉంటుంది. తక్కువ రిస్క్‌తో పాటు కచ్చితమైన రాబడిని కోరుకునే వారికి ఇలాంటి జీవితా బీమా ఉత్పత్తులు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. ఒకవేళ పాలసీ దారు అకాల మరణం పాలైతే బీమా మొత్తాన్ని నామినీకి అందచేస్తారు. ఇలాంటి పాలసీ ఎవరికీ


అత్యుత్తమ సాధనం అంటే..

1. కచ్చితమైన రాబడిని హామి ఇచ్చే జీవిత బీమా పాలసీలో ఎవరైనా సరే నిర్ణీత సమయాల్లో వెనక్కి తీసుకోవచ్చు. ఇలా క్రమంగా వస్తున్న రాబడులను లైఫ్‌ైస్టెల్ రాజీ పడకుండా రుణాల తీర్చుకునేందుకు కూడా ఉపయోగపడుతాయి.


2. రుణాలను తీర్చేయడమే కాకుండా ఇల్లు కొనుక్కోవడం, పిల్లలను విదేశీ విద్య కోసం పంపించడం, వినోద పర్యటనలను చేయడం, రిటర్మెంట్ వంటి జీవిత లక్ష్యాల కోసం కూడా ఉపయోగించుకోవచ్చు. ఈ సరదాలను తీర్చుకోవాలంటే మాత్రం క్రమశిక్షణతో కూడిన ప్రణాళిక అవసరం. రాబడుల గ్యారంటీ ఇచ్చే బీమా పథకాలు అలాంటి సరదాలను తీర్చకోవడానికీ ఉపయోగపడతాయి.


3. నిర్ణీత సమయానికి కచ్చితమైన మొత్తాన్ని హామీ ఇవ్వగలిగిన ఏకైక సాధనం జీవిత బీమానే. తాము సంపాదించిన మొత్తానికి రిస్క్ లేకుండా రాబడి హామిని జీవిత బీమా ఉత్పత్తులే అందిస్తాయి. అతి తక్కువ రిస్క్ ఉన్న ఈ బీమా ఉత్పత్తులే బెస్ట్ ఆప్షన్‌గా పరిగణించాల్సి ఉంటుంది.


ఒక్క మాటలో చెప్పాలంటే గ్యారంటీ రాబడులను అందిస్తున్న జీవిత బీమా ధీమాతో పాటు కుటుంబ భవితకు భద్రతను కల్పిస్తాయి. కచ్చితమైన రాబడులు తమ జీవిత లక్ష్యాలను చేరుకోవడానికి దోహదపడుతాయి. అలాగే ఇన్వెస్ట్‌మెంట్, పొదుపు ప్రణాళికల సమ్మేళనానికి ఇవి ఉపయోగపడుతాయి. స్వల్ప, దీర్ఘకాలిక లక్ష్యాలను చేరుకోవడానికీ ఉపయోగపడుతాయి. డెత్ బెనిఫిట్‌తో కుటంబ భద్రతకు భరోసాను జీవిత బీమా కల్పిస్తుంది. రాబడుల్లో హెచ్చుతగ్గుల రిస్క్‌లు ఉండవు.


అందుకే కచ్చితమైన రాబడికితోడు క్రమం తప్పకుండా రాబడిని చేతికి అందించడం వంటి ప్రయోజనాలున్న జీవిత బీమా ఉత్పత్తులు ఫైనాన్షియల్ ప్లానింగ్ ఒక భాగంగా ఉండాల్సిందే.
raja

572
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles