ఎఫ్‌డీలలో రిస్క్ తక్కువేనా?


Sat,January 5, 2019 01:15 AM

-ఫిక్స్‌డ్ డిపాజిట్ అకౌంట్
fixed-deposit
అదనపు ఆదాయం వస్తుందన్న అంచనాతోనే పెట్టుబడులు పెడుతారు అందరూ. మార్కెట్లు దూసుకుపోతున్న ప్రస్తుత తరుణంలో ఏయే రంగాల్లో పెట్టుబడులు పెడితే అధికం లాభం చేకూరుతున్నదనే విషయం పెట్టుబడిదారుల్లో మెదులుతున్న ప్రశ్నలు. స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్లు, ఫిక్స్‌డ్ డిపాజిట్లు, బాండ్లుతోపాటు మరిన్ని కనబడుతున్నాయి. తాము పెట్టుబడిన పెట్టిన దానికంటే కనీస రిటర్నులు వచ్చిన వాటికే మొగ్గుచూపుతారు పెట్టుబడిదారులు. వీటిలో ఫిక్స్‌డ్ డిపాజిట్టు కూడా ఒకటి.

ఎఫ్‌డీతోపాటు మరిన్ని పెట్టుబడి అస్ర్తాలు..

ప్రతి ఒక్క పెట్టుబడి రిస్క్‌తో కూడుకున్నదే. ఒక్కసారి లాభాలు అధికంగా రావచ్చు..మరోసారి నష్టాలే మూటగట్టుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకు స్టాక్, ఈక్విటీలో పెట్టుబడులు పెట్టినవారికి అధిక రిటర్నులు పంచే అవకాశాలు ఉన్నప్పటికీ ఇందుకు రిస్క్ చేయాల్సి ఉంటుంది. ఒక్కసారి లాభాలు రావడం మరోసారి నష్టాలు రావడం పరిపాటి కానీ అధికంగా రిస్క్ చేసినప్పటికీ నష్టాలు కూడా రావచ్చును. ఇదే సమయంలో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్స్, బాండ్లు, లిక్విడిటీ ఫండ్స్, ఫిక్స్‌డ్ డిపాజిట్లులో తక్కువ రిస్క్ ఉన్నప్పటికీ రిటర్నులు ఎంతో కొంత మెరుగ్గావుంటాయి.

నమ్మకమైన రిటర్నులు..

స్టాక్ మార్కెట్లు కుప్పకూలని..ఆర్థిక సంక్షోభంరాని కానీ ఫిక్స్‌డ్ డిపాజిట్లలో పెట్టుబడులు పెట్టిన వారికి ఎలాంటి ఢోకా ఉండదు. వారికి వడ్డీ రూపంలో కనీస రిటర్నులు వచ్చే అవకాశం ఉంటుంది. ఎలాంటి రిస్క్‌ను ఎదుర్కొనని వారు ఎఫ్‌డీలను ఎంచుకోవడం మంచిది. ప్రస్తుతం బ్యాంకులు పొదుపు ఖాతాలపై ఇస్తున్న వడ్డీ కంటే ఎఫ్‌డీలపై చెల్లిస్తున్న వడ్డీరేటు అధికంగా ఉంది. ఒక్కసారి డిపాజిట్ చేసిన వారు కనీసంగా ఐదేండ్ల వరకు అలాగే ఉంచాలి, అప్పుడే అధిక రిటర్నులు వచ్చే అవకాశం ఉంటుంది.

ఆకట్టుకుంటున్న సీనియర్ సిటీజన్లు

మిగతావారితో పోలిస్తే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై పెట్టుబడి పెట్టేవారిలో సీనియర్ సిటీజన్లు అధికంగా ఉంటున్నారు. ప్రస్తుతం యువతీ యువకులకు అందిస్తున్న వడ్డీరేటుతో పోలిస్తే సీనియర్ సిటీజన్లకు అధికంగా వడ్డీరేటును అందించడం కూడా ఇందుకు దోహదం చేస్తున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగం చేసి పదవీ విరమణ చేసిన తర్వాత వచ్చే అధిక మొత్తంలో కొంతమేర బ్యాంకుల్లో డిపాజిట్లు చేసేవారు అధికంగా ఉంటున్నారు. ఏ సమయంలో ఏమి అవసరం ఉంటుందో ముందస్తు అంచనాతో వారు ఎఫ్‌డీల వైపు మొగ్గుచూపుతున్నారు. వీరికి రూ.50 వేల వరకు పన్ను రాయితీ కూడా లభిస్తున్నది.
sikka

అధిక వడ్డీరేట్లు..

అధిక వడ్డీని బ్యాంకులు, ఆర్థిక సేవల సంస్థలు ఆఫర్ చేస్తుండటంతో ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేసే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతున్నారు. బ్యాంకుల్లో ఎఫ్‌డీలు చేయడం సురక్షితంతోపాటు అధిక రిటర్నులు కూడా పంచుతుండటం కూడా ఇందుకు కారణమవుతున్నది. పెట్టుబడిదారులు సౌకర్యవంతంగా ఉండే వాటికే మొగ్గుచూపుతున్నారు. వీటిలో ఎఫ్‌డీలు ఒక్కటి. దీర్ఘకాలికంగా పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎప్పుడు అవసరమైనప్పుడు తీసుకునే అవకాశం ఉండటం మంచి సౌలభ్యం. డిపాజిట్లపై కూడా పలు రకాల వడ్డీరేట్లను ఆఫర్ చేస్తున్నాయి బ్యాంకులు, ఆర్థిక సంస్థలు. అధిక వడ్డీకావాలంటే అత్యధిక మొత్తంలో డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్లు..ఎంత డిపాజిట్ చేస్తే అంత వడ్డీరేటు వస్తున్నది. అలాగే సాధారణ ఆదాయం మాదిరిగా వడ్డీరేటును పొందవచ్చును.

ఫిక్స్‌డ్ డిపాజిట్లపై రుణం రాదు

అత్యవసర సమయంలో డబ్బులు కావాల్సినప్పుడు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై రుణం తీసుకునే అవకాశం మాత్రం వినియోగదారులకు లేదు. ఎందుకంటే తమ కు లభిస్తున్న వడ్డీరేటు కంటే ఎక్కువ వడ్డీరేటు చెల్లించాల్సి ఉంటుంది. దీనివల్ల డిపాజిట్‌దారులకు నష్టమే జరుగుతుండటంతో రుణం తీసుకోకుండా వాటిని ఉపసంహరించుకోవడం మంచిది.

493
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles